మంచు ముల్లె..


Sun,January 13, 2019 01:59 AM

మంచిర్యాల అగ్రికల్చర్: రోజు రోజుకు తగ్గుతు న్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో చలి తీవ్రత విపరీతం గా పెరుగుతోంది. రాత్రిపూట చల్ల గాలులు సైతం వీస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఐదు దాటిందంటే సూర్యుడు జారుకోవడం, రాత్రి ఏడు దాటితో చా లు విపరీతమైన గాలులతో పాటు చలి విస్తోంది. పిల్లలు, వృద్ధులులు బయటకు వెళ్లే సాహసం చే యడం లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు ప్రతి రోజు పడిపోతున్నాయి. మరోవైపు పొగమంచు ఉదయం పది గంటల వరకు కూడా వీడటం లేదు. ఉద యం, సాయంత్రం వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఉదయం పూట ఎనిమిది గంటల వరకు చలి తీవ్రత ఉంటోంది. పొగమంచుతో మరింత చలి కనిపిస్తోంది. దీనితో తొమ్మి ది, పది గంటల వరకు బయట జనాలే కనిపించని పరిస్థితి... అంతే కాకుండా సాయంత్రం ఆరైందంటే చాలూ చల్లగాలులతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి పెరుగుతుందని వాతావరణ శాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. మరికొద్ది రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెబుతున్నారు.
పొగమంచు, చలి తీవ్రత నేపథ్యంలో డ్యూటీలకు వెళ్లాలంటేనే సింగరేణి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, రాత్రి షిప్టు కార్మికులదైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చల్ల గాలులతోపాటు చలి తీవ్రత పెరగడంతో వారు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇక ఓపెన్ కాస్టు గనుల్లో పని చేసే కార్మికులు మరింత అవస్థలు పడాల్సి వస్తోంది. అటు పొగమంచు, ఇటు దుమ్మూ, ధూళితో పని కూడా సక్రమంగా చేయలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఎదురుగా ఏ ముందో తెలియని స్థితిలో ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు చెబుతున్నారు. దీంతో చాలా చోట్ల కార్మికుల హాజరు శాతం తగ్గింది. ఆ ప్రభా వం ఉత్పత్తిపై పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులు మరింత అగచాట్లకు గురవుతున్నారు. మరోవైపు వృద్దులు చలిని తట్టుకోలేక బయటకు వెళ్లలేని పరిస్థితి. సాయం త్రం ఐదు గంటలు దాటితే స్వెట్టర్లు ధరించి చలిమంటలు వేసుకుంటున్నారు.
సూర్యోదయం నుంచి మొదలు సూర్యాస్తమ యం వరకు ఎర్రని కిరణాలతో కనిపించే సూర్యు డు పొగమంచుతో కూడిన చలి వల్ల తెల్లగా చం ద్రుడి వలే దర్శనమిస్తున్నాడు. ఉదయం పది గం టల తరువాతగాని మబ్బుల మాటు నుంచి సూ ర్య కిరణాలు నేలకు చేరడం లేదు. చలికి తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...