విఘ్నాలు తొలగించే..విఘ్నేశ్వరుడు..


Thu,September 13, 2018 12:00 AM

-ఊరూరా కొలువుదీరనున్న గణనాథుడు
-జిల్లావ్యాప్తంగా మండపాల ఏర్పాటు
మంచిర్యాల టౌన్, నమస్తే తెలంగాణ : విఘ్నాలు తొలగించే.. విఘ్నేశ్వరుడిని నవరాత్రులు పూజించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. గురువారం వి నాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గణనాథులను నెలకొల్పేందుకు మండపాల నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పలు ప్రాంతాల్లో భారీ సెట్టింగులతో మండపాలు ఏర్పాటు గురువారం నుంచి తొమ్మిది రోజుల పాటు నిత్యపూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
మండపాలకు చేరుతున్న ప్రతిమలు..
వినాయక చవితిని పురస్కరించుకొని నిర్వహించనున్న నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ప్రజలు వినాయక ప్రతిమలను గ్రామాలకు తరలించారు. పలుచోట్ల పాఠశాలల్లో విద్యార్థులు స్వయంగా మట్టితో గణపతులను తయారుచేసి గ్రామాల్లో అవగాహన కల్పించారు. ఆటోలు, ట్రాలీలు, వ్యాన్లలో గ్రామాలకు చేర్చారు. మరోవైపు జిల్లాకేంద్రంతో పాటు చెన్నూర్, మందమర్రి, కాసిపేట, తాండూర్ మండలాలతో పాటు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. రసాయన రంగులతో తయారు చేసిన ప్రతిమలను ప్రతిష్టించవద్దని గ్రామాల్లో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రచారం చేశారు.
నిబంధనలివే..
మండపాల వద్ద నిర్వాహకులు, కమిటీ సభ్యు లు తప్పకుండా నిబంధనలు పాటించాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.
-ప్రతి మండప నిర్వాహకులు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో దరఖాసు చేసుకోవాలి
-డీజే సిస్టం వాడద్దు
-సాంస్కృతిక కార్యక్రమాలకు మైక్ వినియోగం కోసం సంబంధిత ఏరియా డీఎస్పీ నుంచి అనుమతి పొందాలి.
-ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మండపాలు,ప్రతిమలు ఏర్పాటు చేసుకోవాలి.
-గాలి.వర్షాలకు మండపాలు కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
-విద్యుదాఘాతాలకు తావులేకుండా నాణ్యమైన వైర్లను వినియోగించాలి.
-జూదం,రికార్డింగ్ డ్యాన్స్‌లు తదితరల కార్యకలాపాలు మండపాల పరిసరాల్లో చేపట్టరాదు.
-రాజకీయ ప్రసంగాలు, నినాదాలకు తావివ్వరాదు.
-వ్యక్తులు ,సముహాలను రెచ్చగోట్టేలా వ్యవహరించరాదు.
-భారీ మండలపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా రికార్డింగ్ సదుపాయం ఉన్న సీసీ కెమెరాలను ఎంట్రీ, పార్కింగ్ స్థలాల్లో అమర్చుకోవాలి.
-పటాకులు, తదితర పేలుడు వస్తువులు వినియోగించరాదు.
-విద్యత్ సరఫరా విషయంలో ఆధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి
-మండపాల వద్ద వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి
-ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రేమే సౌండ్ సిస్టం వాడాలి
-విద్యాసంస్థలు, దవాఖానలు, న్యాయస్థానాలకు వంద మీటర్ల దూరం వరకు నిశ్శబ్ధ జోన్‌గా గుర్తుంచుకోవాలి.
-నిమజ్జనం రోజు శోభాయాత్ర ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముగించాలి.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...