మట్టి వినాయకులను పూజించండి


Wed,September 12, 2018 11:59 PM

-సింగరేణి జీఎంల పిలుపు
-మట్టి విగ్రహాల పంపిణీ
-పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచన
సీసీసీ నస్పూర్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని శ్రీరాంపూర్ ఏరియా ఎస్‌ఓటూజీఎం సత్యనారాయణ పిలుపునిచ్చారు. సింగరేణి ఆధ్వర్యంలో బుధవారం నస్పూర్‌కాలనీ సేవా భవన్ వద్ద కార్మికులు, కాలనీవాసులకు మట్టి వినాయకులను ఉచితం గా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్వ కాలంలో మట్టి వినాయకులను పూజించే వారనీ, ప్రస్తుతం పీఓపీతో తయారు చేసిన వినాయక విగ్రహాల తో జల, వాయు కాలుష్యం ఏర్పడుతుందన్నారు. తద్వారా ప్రమాదరకరమైన వ్యాధు లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్యావరణ అధికారి అమరేందర్‌రెడ్డి, పర్సనల్ అధికారి అజ్మీరా తుకారాం, సేవా కార్యకర్తలు రత్నకళ, మం జుల, సునీత, శంకరమ్మ, తిరుమల, లత, స్వప్న, పీఆర్‌ఏ సంపత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
రెబ్బెన : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బెల్లంపల్లి ఏరి యా జీఎం రవిశంకర్ సూచించారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్‌షిప్‌లో సింగరేణి దవాఖాన వద్ద బుధవారం సింగరేణి యాజమాన్యం అందించిన మట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం జీఎం రవిశంకర్ మాట్లాడుతు మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూ జించాలని కోరారు. మొక్కలను పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేవా అధ్యక్షురాలు అనురాధ, ఆధికారుల సంఘం అధ్యక్షుడు చింతల శ్రీనివాస్, డీజీఎం(పర్సనల్) జే కిరణ్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, డీవైపీఎం లు బి.సుదర్శనం, ఏ రాజేశ్వర్, ఎల్ రామాశాస్త్రి, ఎస్‌ఎస్‌ఓ వరప్రసాద్, ఎన్విరాన్‌మెంట్ ఆధికారి కృష్ణచారి పాలొన్నారు.
మట్టి వినాయకులే శ్రేష్టం..
మందమర్రి రూరల్ : మట్టి వినాయకులే శ్రేష్టమని ఏరియా జీఎం రాఘవులు పేర్కొన్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యం లో ఆయన స్థానిక సీఈఆర్ క్లబ్‌లో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రసాయనాల తో తయారు చేసే వినాయక విగ్రహాలను వాడద్దన్నారు. ఇవి పర్యావరణానికి ఎంతో హాని చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ జేమ్స్, పర్యవరణ అధికారి రామస్వామి, పండితులు గోవర్థనగిరి అనంతాచార్యులు, సిం గరేణి సేవా సభ్యులు పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...