-తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
-ఇంటింటా ప్రచారం
దండేపల్లి : టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌ను ఎదుర్కొనే ద మ్ము, ధైర్యం లేకనే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని తాజా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించా రు. బుధవారం మండలంలోని కొత్త మామిడిపెల్లి గ్రామం లో ఇంటింటా తిరిగి ప్రజలను పలుకరించారు. అంతకు ముందు మేదరిపేట నుంచి కొత్త మామిడిపెల్లి వరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బొట్టు పెట్టి దివాకర్‌రావును ఆశీర్వదించారు. మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పథకాలే రానున్న ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్కు పట్టం కడుతాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎక్కడి కెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనీ, స్థానికంగా ఉండి, ప్రజా సమస్యలు పరిష్కరించే వారిని ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైసస జిల్లా కన్వీనర్ మోటపల్కుల గురువయ్య, జడ్పీటీసీ యశ్వంత్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బండారి మల్లేశ్, నాయకులు గోళ్ల రాజమల్లు, నజీర్, వెంగళరావు, నలిమెల మహేశ్, చుంచు మల్లేశ్, శ్రీనివాస్, తిరుపతి, వెంకటేశ్, రామయ్య, రమేశ్, భూమన్న, సుధాకర్, మల్లయ్య పాల్గొన్నారు.