నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలి


Wed,September 12, 2018 11:58 PM

-100 శాతం మరుగుదొడ్లు నిర్మించేలా చూడాలి : డీపీఓ
మంచిర్యాల అగ్రికల్చర్ : వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. మంచిర్యాల ఎంపీపీ కార్యాలయంలో ఉమ్మడి మంచిర్యాల మండలంలోని హాజీపూర్, నస్పూర్ మండలాల్లోని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో మంచిర్యాల మండలం ఉమ్మడి ఆదిలాబాద్‌లో 100 శాతంతో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఉమ్మడి మంచిర్యాల మండలంలో 15 పంచాయతీల్లో 8 గ్రామ పంచాయతీల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం కాగా, ఏడు జీపీల్లో సైతం లక్ష్యసాధన కొద్ది దూరంలో ఉందన్నారు. అక్టోబర్2లోగా ఈ లక్ష్యాన్ని అధికారులు సాధించాలన్నారు. వెంటనే స్పెషల్ డ్రైవ్ కింద పది రోజుల్లో లక్ష్యం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో అబ్దుల్ హై, ఈజీఎస్ ఏపీఓ మల్ల య్య, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శులు శ్రీపతి బాపురావు, కే సమ్మిరెడ్డి, అజ్మత్ ఆలీ, శ్రీనివాస్, సత్యనారాయణ, జాదవ్ మాధవ్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఐకేపీ సీసీలు పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...