అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ


Wed,September 12, 2018 11:56 PM

గర్మిళ్ల : శిశు సంక్షేమ శాఖ వరంగల్ రీజినల్ డైరెక్టర్ ఆశ్రిత బుధవారం మంచిర్యాలలో పలు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. కేంద్రాల ద్వారా సేవలు సరిగా అందుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నార లేదా అని ఆరా తీశారు. అంగన్‌వాడీ బడికి చిన్నారులను పంపించాలని సూచించారు. రికార్డులను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ నగర్ 1, సాయినగర్, సపాయి వాడ అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఎన్‌టీఆర్ నగర్ 1 అంగన్‌వాడీ కేంద్రంలో 20 మందికి పైగా గర్భిణులు, బాలింతలు, 15 మందికి పైగా చిన్నారులు హాజరు కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌జేడీ అడిగిన ప్రశ్నలకు లబ్ధిదారులు సరైన సమాధానం చెప్పడంతో టీచర్ రేణుకాదేవిని అభినందించారు. రికార్డులు అన్నీ సక్రమంగా ఉండడంతో ఆమెను ప్రశంసించారు. జిల్లాలో అన్ని సెంటర్లు ఈ విధంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి రవూఫ్‌ఖాన్‌కు సూచించారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను మహిళలకు వివరించారు. చిన్నారులకు పౌష్టికాహాన్ని అందిస్తూ, తాము కూడా సరైన పౌష్టికాహారం తీసుకుంటామని గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్‌జేడీ వెంట సీడీపీవో ఆశాలత, సూపర్‌వైజర్లు సల్మా, బీజీన్‌బీ ఉన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...