వర్షపు నీటి వినియోగంపై అవగాహన


Wed,September 12, 2018 11:55 PM

మందమర్రి : వర్షపు నీటి పారుదల, మురుగునీటి పారుదల సమగ్ర రూపకల్పనపై బుధవారం మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో బిల్డ్ కాన్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో తెలంగాణ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు(టీఎండీపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థపై ప్రాజెక్టును తయారు చేసేందుకు నియమించిన బిల్డ్‌కాన్ కన్సల్టెన్సీ సభ్యుడు రామానుజం మాట్లాడారు. వర్షం నీటి పారుదల, మురుగునీటి పారుదల పై ప్రజలకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మందమర్రి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాము చేస్తున్న సర్వేకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు మురుగునీటి శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నీరు వృథా కాకుండా ఉంటుందన్నారు. శుద్ధి చేసిన నీటిని నర్సరీలకు గానీ వ్యవసాయ అవసరాలకు ఉపయోగించు కునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. నీటి వినియోగం పై ప్రతి ఒక్క రు అవగాహన కలిగి ఉండాలన్నారు. పట్టణంలో సర్వే పూర్తయిన అనంతరం ప్రతిపాదనలను రూపొందించి నిధుల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏఈ అచ్యుత్, టీఆర్‌ఎస్ మున్సిపల్ ఇన్‌చార్జి కొంగల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...