ఈవీఎంలు వచ్చేశాయ్..


Wed,September 12, 2018 11:55 PM

-రాష్ట్రంలోనే తొలుత ఆసిఫాబాద్‌కు..
-బెంగళూర్ నుంచి ప్రత్యేక వాహనంలో తెచ్చిన అధికారులు
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లను అధికారులు బుధవారం ఆసిఫాబాద్ జిల్లాకు తెప్పించారు. మూడు రోజుల క్రితం ఈవీఎంల కోసం బెంగళూర్‌కు వెళ్లిన అధికారులు ప్రత్యేక భద్రత మధ్య జిల్లాకు అవరసమైన యంత్రాలను తీసుకువచ్చారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు గోదాంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి భద్రపరిచారు. ప్రత్యేక వాహనంలో 152 ఐరన్ బాక్సుల్లో ఈవీఎంలను తెచ్చారు. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ యంత్రాలను తీసుకువచ్చారు. 85 బాక్సుల్లో 850 బ్యాలెన్సింగ్ యూనిట్లను( బీయు), 67 బాక్సుల్లో కాంటాక్టు యూనిట్ల్లు(సీయు) ఉన్నాయి. 152 బా క్సుల్లో జిల్లాకు కావాల్సిన ఈవీఎంలు జిల్లాకు తీసుకువచ్చారు. మరో మూడు నాలుగు రోజులు హర్యా నా నుంచి జిల్లాకు అవసరమైన 720 వీవీ ప్యాట్‌లను తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తొలుత ఆసిఫాబాద్‌కే..
అసెంబ్లీ రద్దు అనంతరం రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలుత జిల్లాకు ఈవీఎంలు చేరుకున్నాయి. ఆసిఫాబాద్ ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ భౌమిక్ ఆధ్వర్యంలో ప్రత్యేకాధికారుల బృందం మూడు రోజుల క్రితం బెంగళూరు వెళ్లింది. అక్కడి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఈ మిషిన్లను ప్రత్యేక వాహనంలో మంగళవారం రాత్రి జిల్లాకు తీసుకువచ్చారు. ఎస్పీ కార్యాలయంలో బందోబస్తు నడుమ ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మార్కెట్ యార్డులోని గోదాంలోకి చేర్చారు. వాహనంలో తీసుకువచ్చిన యంత్రాలను వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో వాహనానికి వేసిన సీలును పరిశీలించి, తెరిచారు. అనంతరం బాక్సులను గోదాంలో నిల్వ చేశారు.

హర్యానా నుంచి వీవీప్యాట్‌లు..
ఈ సారి కొత్తగా ప్రవేశపెడుతున్న వీవీ ప్యాట్‌ల ను త్వరలోనే హర్యానా నుంచి తీసుకువచ్చేందుకు అధికారుల బృందం అక్కడికి వెళ్లనుంది. దీనికోసం బుధవారం సాయంత్రం అధికారులు బయల్దేరిన ట్లు సమాచారం. మరో మూడు నాలుగు రోజుల్లో అవసరమైన వీవీప్యాట్లను జిల్లాకు తీసుకురానున్నారు. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఈవీఎంల పనితీరుతో పాటు, ఓటు వేసిన త రువాత ఎవరికి ఓటు వేశామో రిసిప్టును కూడా వీవీప్యాట్ల ద్వారా అందించనున్నారు. పూర్తిస్థాయిలో మిషిన్లు జిల్లాకు చేరుకున్న తర్వాత రాజకీయ పార్టీ ల నాయకుల సందేహాలను నివృత్తి చేయనున్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...