విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంపొందించుకోవాలి


Wed,September 12, 2018 01:09 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలని లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా అన్నారు. మంచిర్యాలలోని సైన్స్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన సైన్స్ సెమినార్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని చెప్పారు. సైన్స్‌సెంటర్‌ను సందర్శించిన ప్రతి విద్యార్థికి సైన్స్ సబ్జెక్టుపై ఆసక్తి పెరుగుతుందనడంలో సందేహం లేదన్నారు. జిల్లా మొదటి కలెక్టర్ కర్ణన్ కృతో మంచిర్యాలలో సైన్స్ సెంటర్ ఏర్పాటందని జిల్లా సైన్స్ అధికారి మధుబాబు అన్నారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్, జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖాధికారి రాహుల్‌రాజ్ ఆధ్వర్యంలో సైన్స్ సెంటర్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పారిశ్రామిక విప్లవం 4.0కు మీరు సిద్ధమేనా? అనే అంశంపై జరిగిన సెమినార్‌లో జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్,సెక్టోరియల్ అధికారి సఫ్ధర్‌అలీ, గ్రీన్‌కోర్ శిక్షకుడు యోగేశ్వర్ పాల్గొన్నారు. 27 మంది విద్యార్థులు పాల్గొనగా ప్రతివ్యాస్ (సెవన్‌హిల్స్ హైస్కూల్) మొదటి బహుమతి, మధుబాబు (టీఎస్ మోడల్ స్కూల్) రెండో బహుమతి, నివేదిత (సినిమావాడ ప్రభుత్వ పాఠశాల) మూడో స్థానంలో నిలిచారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...