ఓటరు జాబితా సవరణపై అవగాహన


Wed,September 12, 2018 01:09 AM

చెన్నూర్, నమస్తే తెలంగాణ : చెన్నూర్ తహసీల్దా ర్ కార్యాలయంలో జాయింగ్ కలెక్టర్ సురేందర్‌రా వు బూత్ లెవల్ అధికారులతో ఓటరు జాబితా సవ రణపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని సూచించా రు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత బూత్ లెవల్ అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాలో నమోదు కాని వారి పేర్లు ఉంటే నమోదు చేయాలని తెలిపారు. 15,16 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవల్ అధికారులు ఓటర్లుకు అందుబాటులో ఉండాలని తెలిపారు. తహసీల్దార్ శ్రీనివాస్ ఓటరు జాబితాకు సంబంధించిన 6, 6ఏ,7,8, 8ఏ ఫారాల గురించి వివరించారు. ఈ సమావేశంలో కోటపల్లి తహసీల్దార్ మధుసూధన్, రెవెన్యూ సిబ్బం ది, బూత్ లెవల్ పాల్గొన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...