5,01,743 తాజాగా జిల్లా ఓటర్ల సంఖ్య!


Tue,September 11, 2018 12:49 AM

-ఓటరు ముసాయిదా విడుదల
-తొలిసారిగా వీవీ ప్యాట్‌ల వినియోగం
-ఓటు నిర్ధారణ కోసం ఏర్పాట్లు
మంచిర్యాల రూరల్ : జిల్లాలో ఓటర్ల లెక్క తేలి పోయింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట రు ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకా రం.. జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలో 2,00,504, చెన్నూర్‌లో 1,55,153, బెల్లంపల్లిలో1,46,086 మంది ఓటర్లు ఉన్నారు. మూడు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు 2,45,001, పురుష ఓటర్లు 2,56,668, ఇతరులు 74 ఉన్నారు. ఈ మూడు నియోజక వర్గాలలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా కొత్త పొలింగ్ కేంద్రాలతో కలిసి మంచిర్యాల నియోజకవర్గంలో 272, బెల్లంపల్లి నియోజకవర్గంలో 206, చెన్నూ ర్ నియోజకవర్గంలో 220 పొలింగ్ కేంద్రాలున్నా యి. ఈవీఎంలు 1120, అదనంగా ఈవీఎంలు 698, వీవీ ప్యాట్‌లు 940, కంట్రోల్ యూనిట్లు 870 ఉంటాయి. పట్టణంలోని పొలింగ్ కేంద్రం లో 1,400 మంది, గ్రామీణ పొలింగ్ కేంద్రంలో 1,200 మంది ఓటర్ల కంటే ఎక్కువ మంది ఓట ర్లు ఉండకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో జరుగబోయే ఎన్నికల్లో ఒక్కొక్క ఈవీఎంకు ఒక్కొక్క వీవీ ప్యాట్(ఓటరు వెరీపైడ్ పేపర్ అడిట ట్రయల్)ను అనుసధానం చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 2 వేలకు పైగా ఈవీఎంలు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీవీ ప్యాట్‌లు కూడా అదే స్థాయిలో అవసరం అవుతాయి.

వీవీ ప్యాట్‌లు పని విధానం..
ఎన్నికల నిర్వాహణ కోసం 2 వేల ఈవీ ఎంలు అందుబాటులోనికి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే స్థాయిలో వీవీ ప్యాట్ లను కూడా సిద్ధం చేస్తున్నారు. త్వరలో జరగబో యే ఎన్నికల్లో ఓటరుకు రసీదును ఇచ్చేందుకు వీవీ ప్యాట్‌లను తొలిసారి అమలు చేయనున్నా రు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సరిపడా రసీదులు ఇచ్చేందుకు ప్రింటింగ్ పేపర్‌ను అం దుబాటులో ఉంచనున్నారు. ఒక ఓటరు ఓటు వెయ్యడానికి ఈవీఎం మిషన్ వద్దకు వెళ్లి ఈవీ ఎంపై ఓ గుర్తు గల బటన్‌పై ప్రెస్ చేస్తాడు. మనం ఏ గుర్తుకు ఓటు వేశామో ఆ గుర్తు రెండు సెకం డ్లపాటు వీవీ ప్యాట్ మిషన్‌లో రసీదు రూపంలో ఓటరుకు కనిపించి కింద ఉన్న బాక్స్‌లో పడిపో తుంది. అట్టి రసీదు మనం తీసుకోవటానికి వీలు పడదు. మనం ఏ గుర్తుకు ఓటు వేశామో నిర్ధారణ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలు మొరాయిస్తే వీవీ ప్యాట్ బాక్స్‌లోని రసీదులను బ్యాలెట్ బాక్స్ ఓట్లు లెక్క కట్టి కౌంటింగ్ చేస్తారు.

వీవీ ప్యాట్‌ల వినియోగంపై శిక్షణ
త్వరలో జరగబోయే ఎన్నికల్లో నూతనంగా వినియోగించే వీవీ ప్యాట్‌ల గురించి వచ్చే నెలలో ప్రజలకు అవగాహన కలిపించనున్నట్లు జిల్లా అధికారి యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తు న్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాం గం వీటికి సంబంధించిన శిక్షణను దశలవారీగా శిక్షణను తీసుకున్నట్లు సమాచారం. జిల్లాకు సరిప డా ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు రానున్న నేపథ్యం లో వాటిని భద్రపర్చేందుకు అధికారులు గోడౌ న్లను సిద్ధం చేశారు. ఈ గోడౌన్లను సోమవారం కలెక్టర్ భారతి హోళికేరి,అస్టిటెంట్ కలెక్టర్ స్నేహ లత, రాజస్వ మండల అధికారి కుతాటి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లోని గోడౌన్ల భద్రత, వాటి నిల్వ సామ ర్థ్యం, భద్రపర్చేందుకు అనువుగా ఉన్న వాటిని పరిశీలించారు. ఎన్నికల యంత్ర సామగ్రి వచ్చిన వెంటనే ప్రతిదీ వీడియో రికార్డింగ్ ద్వారా గోడౌన్ల లో భద్రపర్చాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...