విజయోస్తు..


Tue,September 11, 2018 12:48 AM

-టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదిస్తున్న ప్రజలు
-మా ఓటు మీకే వేసి గెలిపించుకుంటామని ఆన
-పల్లెల్లో గులాబీ శ్రేణుల ముమ్మర ప్రచారం
-నుదుట బొట్టు పెట్టి.. హారతి పడుతున్న మహిళలు
-ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచార హోరు
గ్రామాల్లో ప్రచారం చేపట్టిన టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. బొట్టుపెట్టి, హారతినిచ్చి స్వాగతం పలుకుతున్నారు. నాలుగేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను అభ్యర్థులు వారికి వివరిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో మంత్రి జోగు రామన్న పర్యటించగా, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దోనబండలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం అడవిసారంగాపూర్, దస్తూరాబాద్ మండలం దేవునిగూడ, దస్తురాబాద్, భూత్కూర్, మున్యాల్, గోడిసెర్యాల, రేవోజీపేట, బుట్టాపూర్‌గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట, విర్ధండి, కౌటాల గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, వాంకిడి మండలం నవేగూడలో మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పర్యటించారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...