సద్దుల చీరలొచ్చాయ్..


Tue,September 11, 2018 12:48 AM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్న సద్దుల బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరెలు జిల్లాకు చేరుకుంటున్నాయి. నాలుగేళ్లుగా అధికారికంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ సారి కూడా అదే రీతిలో నిర్వహించే ఉద్దేశంతో సద్దుల బతుకమ్మ పండుగకు ముందే మహిళలకు చీరెలు అందించాలన్న ఉదేశంతో చర్యలు చేపట్టింది. తెల్ల రేషన్ కార్డు కలిగి, 18 ఏళ్లు నిండిన మహిళలకు బతుకమ్మ చీరెలు అందించనున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో ఈ సారి 2,54,920 చీరెలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భీమారం మండల కేంద్రంలోని ఏఎంసీ గోదాములు, బెల్లంపల్లిలోని మార్కెట్ కమిటీ గోదాముల్లోకి ఇప్పటికే బతుకమ్మ చీరెలు చేరుకున్నాయి. భీమారంలోని ఏఎంసీ గోదాము నుంచి జన్నారం, దండేపల్లి, లక్షెటిపేట, హాజీపూర్, మంచిర్యాల, నస్పూర్, మందమర్రి, జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాలకు సరఫరా చేయనున్నారు. బెల్లంపల్లిలోని మార్కెట్ కమిటీ గోదాం నుంచి బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, తాండూర్, వేమనపల్లి మండలాలకు సరఫరా చేయనున్నారు. బెల్లంపల్లి మార్కెట్‌కమిటీ యార్డులో మొత్తం 71,046 చీరెలు నిలువ ఉంచాల్సి ఉండగా ఇప్పటివరకు అందులోకి 30 వేల చీరెలు చేరుకున్నాయి. భీమారంలోని గోదాములోకి 1,83,874 చీరెలు నిలువ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు అందులోకి 20వేల చీరెలు చేరుకున్నాయి.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...