అభివృద్ధిని చూడండి..మళ్లీ గెలిపించండి


Tue,September 11, 2018 12:48 AM

మంచిర్యాల రూరల్ : తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని చూసి మరో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)పార్టీని మరోసారి గెలిపించాలని ప్రజలను మంచిర్యాల తాజామాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. సోమవారం హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామంలో ఇంటింటా తిరుగుతూ స్థానిక ప్రజలను, వ్యాపారులను పలుకరించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ గుండాగిరి, రౌడీయిజం, భూ కబ్జాదారులు గ్రామాలకు వస్తారనీ, అలాంటి వారిని గ్రామ పొలిమేరలో నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణలో మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. మరోసారి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మందపెల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు దొమ్మటి సత్తయ్య, దొనబండ ఎంపీటీసీ బేతు రమాదేవి, మాజీ సర్పంచ్ జాడి సత్యం, హాజీపూర్ మండల యువత ఉపాధ్యక్షుడు గడ్డం రమణారెడ్డి, మాజీ సర్పంచ్ సునిల్ రావు, మాజీ వార్డు సభ్యులు భూమన్న, నాయకులు గోళ్ళ శ్రీనివాస్ కార్యకర్తలున్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...