జనం గుండెల్లో నిలిచిన కవి కాళోజీ


Mon,September 10, 2018 02:29 AM

-జేసీ సురేందర్ రావు
మంచిర్యాల రూరల్: పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని జనం గుండెల్లో నిలిచిపోయిన ప్రజాకవి కాళోజీ అని మంచిర్యాల జిల్లా జా యింట్ కలెక్టర్ సురేందర్ రావు అన్నా రు. పద్మభూషన్ కాళోజీ నారాయణ రావు జయంతిని సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్ర పటానికి పూ లమా ల వేసి నివాళులర్పించారు. అనంత రం సురేందర్ రావు మాట్లాడు తూ ఆ మహనీయుడు చూపిన మార్గాన్ని ప్ర జలందరు అనుసరించాలన్నా రు. నా గొడవతో తన అంతరంగాన్ని కవి త్వం ద్వారా ప్రజలకు తెలియచేశారని, మార్పు కోసం విశేషంగా కృషి చేశారనీ, మాతృభాష, కన్నతల్లి లాంటిదని చాటి చెప్పారన్నారు. రాష్ట్ర సాధన ఉ ద్యమంలో ప్రజలను తన రచనలతో చైతన్యం చేసి ఉద్యమంలో ముందుకు నడిపిన మహోన్నతమైన వ్యక్తి అన్నా రు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సంపత్ కుమార్, సూపరింటెండెంట్ రాజానందం, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...