సేవా కార్యక్రమాల్లో ముందుండాలి


Mon,September 10, 2018 02:26 AM

మంచిర్యాల రూరల్ : జిల్లాలోని ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ రంగంలో ఎదగాలని వాసవీక్లబ్ అంతర్జాతీయ మాజీ అధ్యక్షుడు యాదా నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల వాసవీక్లబ్, వనితా క్లబ్, వాసవీ కపుల్స్ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్వంలో జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్‌లో నిర్వహించిన వాసవీ క్లబ్ వ్యవస్థాపకుడు కేసీజీఫ్ గుప్తా జయంతి వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులను, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అంతకు ముందు వాసవీమాతకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్ గవర్నర్ పవిత్రం శ్రీనివాస్‌గౌడ్, అంతర్జాతీయ వాసవీక్లబ్ ఉపాధ్యక్షుడు కటుకం హరీశ్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ ముక్త శ్రీనివాస్, క్యాబినెట్ సెక్రటరీ ఎకిరాల శ్రీనివాస్, రీజియన్ చైర్మన్ కొండ చంద్రశేఖర్, అప్పాల శ్రీధర్, రాచర్ల చంద్రశేఖర్, వాసవిక్లబ్ అధ్యక్షుడు పుల్లూరి బాల్‌మోహన్, కపుల్స్ క్లబ్ అధ్యక్షుడు అక్కెనపెల్లి రవిందర్,వనితా క్లబ్ అధ్యక్షురాలు నాగిశెట్టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...