క్రీడా పోటీల్లో రాణించాలి


Mon,September 10, 2018 02:26 AM

-డీవైపీఎం క్రీడల గౌరవ కార్యదర్శి ఆసీఫ్
- కొనసాగుతున్న వర్క్ పీపుల్ గేమ్స్ ఆండ్ స్పోర్ట్స్ పోటీలు
మందమర్రి రూరల్ : మందమర్రి ఏరియాలో వర్క్ ఫీపుల్ గేమ్స్ ఆండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఏరియా స్థాయి క్రీడా పోటీల్లో రాణించాలని కార్మికులకు, ఉద్యోగులకు డీవై పీఎం క్రీడల గౌరవ కార్యదర్శి ఆసీఫ్ సూచించారు. ఆదివారం సింగరేణి పాఠశాల మైదానంలోని వ్యాయమ శాలలో బాడీ బిల్డింగ్, ఫవర్ లిఫ్ట్‌ంగ్, వెయిట్ లిఫ్ట్‌ంగ్ తో పాటు యోగా హాల్‌లో సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. సీఈఆర్ క్లబ్‌లోని ఈత కొలనులో ఈత పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఆసీఫ్ ప్రారంభించారు. ఎస్‌కే, కేకే, ఆదర్స్ గ్రూప్‌లలో జరిగి ఈ పోటీలలో సాంస్కృతిక విభాగంలో జానపద, భజన్‌లో సాదనవేని ప్రభాకర్ మొదటి బహుమతి అందుకున్నారు. ఈత పోటీలలోని వివిధ విభాగాలలో టీ సారయ్య, పీ నారాయణ, ఆర్ వేంకటేశ్వర్లు, భరత్‌లు మొదటి స్థానాన్ని కైవశం చేసుకున్నారు. వెయిట్ లిప్టింగ్ 69 కేజీల విభాగంలో అమరగోండ రాజయ్య, బాడీ బిల్డింగ్‌లో సంజత్ కుమార్, పవర్ లిఫ్టింగ్‌లో ఏ. రవీకుమార్ మొదటి బహుమతి సాధించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకుడు రాజయ్య, ఏఐటీయూసీ నాయకుడు కే. శ్రీనివాస్, క్రీడల కోఆర్డినేటర్ చిన్నయ్య, గ్రౌండ్ ఇన్‌చార్జి నస్పూరి తిరుపతి, క్రీడాకారులు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...