ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం


Mon,September 10, 2018 02:25 AM

సీసీసీ నస్పూర్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం వరంగల్‌లోని టీఆర్‌వీకేఎస్ హెచ్-58 యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్‌ను జిల్లా నేతలు కలిశారు. ఫిట్‌మెంట్ 35 శాతం సాధించడంపై జిల్లా నేతలు జాన్సన్‌ను సన్మానించి జ్ఞాపిక అందించారు. సీఎం కేసీఆర్ ఎన్నడూ లేని విధంగా తమకు 35శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం సంతోషంగా ఉందని సంఘం జిల్లా అధ్యక్షుడు ముస్కె నర్సయ్య, కార్యదర్శి భూమయ్య తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం అభివృద్ధికి తాము ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. 24గంటల విద్యుత్ ఇవ్వడం వెనుక ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తొలగిపోవడానికి తాము చేసిన కృషిని సీఎం గుర్తించి ఫిట్‌మెంట్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సం ఘం వ్యవస్థాపకుడు కోడూరి ప్రకాశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయానంద్, నాయకులు లచ్చన్న, తిరుపతి, సుధాకర్, వినోద్, మల్లేశ్, శ్రీనివాస్ ఉన్నారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...