గోలేటి సీహెచ్‌పీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి


Sun,September 9, 2018 02:01 AM

-టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు
రెబ్బెన : బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి సీహెచ్‌పీ లో విధులు నిర్వహించు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యాన్ని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు కోరారు. గోలేటి సీహెచ్‌పీ లో శనివారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గోలేటి సీహెచ్‌పీ డీజీఎం విశ్వనాథ్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీహెచ్‌పీ కార్మికులకు ఇన్సెంటీవ్ చెల్లించడం, తగినంత సిబ్బందిని నియమించడం, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి, తాగునీరు అందించాలని, కన్వేయర్ టూ నుంచి అత్యవసర సమయంలో దిగడానికి నిచ్చెన ఏర్పాటు చేయాలని, యూనిఫాం వెంటనే అందించాలని, ఆఫీస్ లాగిన్ యుజర్ ఏర్పాటు చేసి సిబ్బందికి కలుగుతున్న అసౌర్యం తొలగించాలని, సీహెచ్‌పీ వద్ద రిక్వెస్ట్ బస్‌స్టాప్ ఏర్పాటు చేయాలని, గోలేటి ఎక్స్‌రోడ్ నుంచి సీహెచ్‌పీ వరకు లైటింగ్ ఏర్పాటు చేయాలని, కన్వేయర్ ఆపరేటర్‌లకు రెండు పనులు చెప్పకుడదని, స్కీల్డ్ మ్యాన్ పవర్ అయిన క్లర్క్ మరియు వెల్డర్లనును ప్రైవేటు, జౌట్ సోర్సింగ్ వారిని తొలగించి పర్మనేంట్ వారిని నియమించాలని, సీహెచ్‌పీ లో ప్రైవేట్ లోడర్, డోజర్ లను ప్రవేశపెట్టవద్దని సీహెచ్‌పీ డీజీఎం ను కొరిగా సానుకులంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కార్పోరేట్ చర్చల ప్రతినిథి మంగిలాల్, కేంద్ర ఛీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్‌రావు, కేంద్ర కమిటి సభ్యులు నల్లగొండ సదాశివ్, అబ్బు శ్రీనివాసరెడ్డి, ఏరియా కార్యదర్శులు రాంరెడ్డి, కుమారస్వామి, రామరావు, సంపత్, చంద్రశేఖర్, ఫీట్ కార్యదర్శి శివకుమార్ లతో పాటు పలువురు ఉన్నారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...