ఓసీపీ-3 ప్రాజెక్టును సందర్శించిన డైరెక్టర్ల బృందం


Sun,September 9, 2018 02:00 AM

యైటింక్లయిన్ కాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలోని ఓసీపీ-3 ప్రాజెక్టును శనివారం సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్. చంద్రశేఖర్, డైరెక్టర్ (పీఅండ్‌పీ) బీ భాస్కర్‌రావు బృందం సందర్శించారు. ఆర్జీ-2 జీఎం డబ్ల్యూ. విజయబాబు, ప్రాజెక్టు అధికారి బండి వెంకటయ్యలతో కలిసి ముందుగా ఏజెంటు కార్యాలయంలో ప్రాజెక్టు పని స్థలాలు, ఉత్పత్తి, ఉత్పాదకత, బొగ్గు నిల్వలపై అధికారులతో చర్చించి, ఆనంతరం వ్యూ పాయింట్ ద్వారా ప్రాజెక్టును పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఆర్జీ-2 డివిజన్ లక్ష్య సాధనలో ఓసీపీ-3 గుండెకాయలాంటిదని తెలిపారు. అంతేకాకుండా సంస్థలో ఓసీపీ-3ని మెగా ప్రాజెక్టుగా గుర్తించి ఆధునాతన భారీ యంత్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. వీటితో వార్షిక బొగ్గు లక్ష్యం 68 లక్షలు సాధించడంతో పాటు 73లక్షల బొగ్గును వినియోగదారులకు రవాణా చేయాలని సూచించారు. ప్రధానంగా ఓబీ సంస్థ ద్వారా 248లక్షల క్యూబి క్ మీటర్లు, డ్రాగ్‌లైన్ ద్వారా 42లక్షల క్యూబిక్ మీటర్లు, అప్ లోడింగు ద్వారా 240లక్షల క్యూబిక్ మీటర్లు వెలికి తీయాలని సూచించారు. ముఖ్యంగా ఉత్పత్తి లక్ష్య సాధనలో ప్రధాన భూమిక పోషించే యంత్రాల పనితీరు, మరమ్మత్తులపై మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు. డైరెక్టర్ల వెంట ఎస్‌ఓటుజీఎం కొండమీది రవీందర్, ప్రాజెక్టు మేనేజర్ బి.మాధవరావు, ఏరియా ఇంజినీర్ స్వామినాయుడు, పీఇ దుర్గాప్రసాద్, సెక్యూరిటీ అధికారి జానకిరామారావు తదితరులున్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...