కొనసాగుతున్న కంటి వైద్య శిబిరాలు


Sat,September 8, 2018 01:11 AM

మంచిర్యాల అగ్రికల్చరల్ : మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపు 16వ రోజైన శుక్ర వారం కొనసాగింది. పట్టణంలోని 22వ వార్డులోని భాష్యం గ్లోబల్ హై స్కూల్‌లో డాక్టర్ శ్యామల, ఆప్తమాలజిస్టు వీ సుధాకర్, కో ఆర్డినేటర్ శ్రీనివాస్, సిబ్బంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే తిలక్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ రాము, ఆఫ్తమాలజిస్టు లక్ష్మీ ప్రసన్న, కో ఆర్డినేటర్ అపర్ణ, సిబ్బంది ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. శిబిరాలకు వచ్చిన వారి వివరాలు నమోదు చేసుకొని కంటి పరీక్షలు జరిపారు. అవసరమున్న వారికి కండ్ల జోళ్ల వెంటనే అందించారు. శస్త్ర చికిత్సలు అవసరమున్న వారిని గుర్తించి వారికి తేదీలు ఇచ్చారు. దూరము, దగ్గర చూపు అవసరమున్న వారికి కండ్ల జోళ్ల కోసం ఆర్డర్ చేశారు. శుక్ర వారం తిలక్ నగర్‌లోని శిబిరానికి 223 మంది వైద్య పరీక్షలకు హాజరు కాగా వారిని పరీక్షించిన అనంతరం 57 మందికి అద్దాలు అందజేశారు. మరో 92 మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. నలుగురిని ఆపరేషన్ కోసం రిఫర్ చేసినట్లు క్యాంపు వైద్యుడు రాము తెలిపారు. క్యాంపునకు వచ్చిన వారిలో 196 మంది పెద్దవారు కాగా 27 మంది చిన్న (18 సంవత్సరాలలోపు) వారు హాజరయ్యారు. అలాగే 22వ వార్డులో 295 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమున్న 47 మందికి అద్దాలు అందజేశారు.

దగ్గరి, దూరపు చూపు కోసం 64 మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. మరో 46 మందిని ఆపరేషన్ కోసం రిఫర్ చేసినట్లు వైద్యురాలు శ్యామల తెలిపారు. పరీక్షలకు వచ్చిన వారిలో 200 మంది పెద్ద వారు కాగా, 95 మంది చిన్నారులున్నారు. మంచిర్యాల పట్టణంలోని రెండు క్యాంపుల్లో 518 మందికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు.

దండేపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు పథకం మండలంలోని మాకులపేట, రెబ్బెన్‌పెల్లి గ్రామాల్లో కొనసాగుతుంది.శుక్రవారం వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేసి మందులు, కంటి అద్దాలు అందజేశారు. చుట్టు ప్రక్కల గిరిజన గ్రామాల నుండి రోగులు తరలి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.కంటి అద్దాలు అవసరం ఉన్నవారికి ఇస్తున్నారు. కాగా శస్త్ర చికిత్స అవసరం ఉన్నవారికి పెద్దసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.ప్రతి రోజు ఒక్కొక్క కేంద్రంలో సుమారు 200 మంది శిబిరాల వద్దకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాని సూచిస్తున్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు సునీల్, అరుణ, హరీష్, స్పురణ, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, తదితరులు ఉన్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...