పల్లెల్లో పొలాల సందడి


Sat,September 8, 2018 01:11 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ/ బెజ్జూర్ : రైతులకు అండగా నిలిచే ఎడ్లను భక్తిశ్రద్ధలతో కొలిచే పండుగ పొలాల అమవాస్య. అన్నదాతలకు పెద్ద పండుగల్లో ఇదొకటి. యేటా శ్రావణమాసం ముగింపు రోజున పొలాల అమవాస్య నిర్వహించడం అనవాయితీగా వస్తున్నది. చేనులో విత్తనాలు విత్తించి మొదలు.. ధాన్యం ఇంటి గడప తొక్కే వరకు ఎద్దు పనికి ఉపయోగపడుతుంది. తమకు ఇంతలా ఉపయోగపడిన ఎద్దులను రైతులు పొలాల అమావాస్య రోజున పూజిస్తారు. వాటిని పూజిస్తే శివుని అనుగ్రహంతో పాటు పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఉత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించేందుకు రైతులంతా సిద్ధమయ్యారు. ఎడ్ల అలంకరణకు జూలు, కాళ్లకు గజ్జెలు, ముగుతాళ్లలాంటివి కొనుగోలు చేశారు.

శ్రావణమాసంలో పూజిస్తే..
శ్రావణమాసం శివుడికి అత్యంత ఇష్టం. తొలి పంటలు చేతికి వచ్చే మాసం కూడా ఇదే. ఈ నెలలో పశువు(నంది)లను పూజిస్తే శంకరుడు సంతోషిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే పొలాల పండుగ రోజు పశువులతో ఎలాంటి పనులు చేయించరు. ఉదయమే వాటికి వాగులు, చెరువుల్లో శుభ్రంగా స్నానాలు చేయిస్తారు. రంగ రంగులతో అందంగా అలంకరిస్తారు. కొత్త ముగుతాళ్లు వేస్తారు. డ సాయంత్రం హనుమాన్, శివాలయం మందిరాల వద్దకు తీసుకువెళ్లి వాటికి పూజలు చేస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన నైవేద్యాన్ని వాటికి తినిపిస్తారు. అనంతరం పెద్దలకు పూజలు చేస్తారు. ఆ తర్వాతే ఇంటిల్లిపాదీ కలిసి విందు ఆరగిస్తారు.

ఇదీ కథ..
పొలాల అమావాస్య. దీనికి పురాణ గాథ కూడా ఉంది. పార్వతీ ఓ రోజు శివుడితో తన పుత్రుడు నందీశ్వరుడు ఎలా ఉన్నాడో చూడాలని అంటుంది. అప్పుడు ఈశ్వరుడు బాగానే ఉన్నాడని చెబుతాడు. అయినప్పటికీ తాను చూడాల్సిందేనని పార్వతీ పట్టుబట్టడంతో ఆమె కోరిక మేరకు నందీశ్వరున్ని చూపించేందుకు తీసుకెళ్తాడు. ఆ రోజునే పొలాల పండుగగా జరుపుకుంటారని పురాణ కథల్లో ఉంది.

202
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...