చెన్నూర్‌పై గులాబీ జెండా ఎగరేద్దాం


Sat,September 8, 2018 01:10 AM

-సమన్వయంతో ముందుకు సాగుదాం
-పెద్దపల్లి ఎంపీ, చెన్నూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్
నమస్తే తెలంగాణ, మంచిర్యాలప్రతినిధి/చెన్నూర్: రాబోయే ఎన్నికల్లో అందరం సమన్వయంతో కలిసి పనిచేసి చెన్నూర్‌పై మరోసారి గులాబీ జెండా ను ఎగరవేద్దామని పెద్దపల్లి ఎంపీ, చెన్నూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పేర్కొన్నా రు. ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుని ప్రచారం చేద్దామని ఆయన చెప్పారు. చెన్నూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు సుమన్‌ను శుక్రవారం తెలంగాణ భవన్‌లో కలిసి అభినందించారు. చెన్నూర్ మొదటి నుంచి టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తుందనీ, మరోసారి పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రజలు సానుకూలంగా ఉన్నారని స్థానిక నాయకులు సుమన్‌కు వివరించా రు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, నియోజక వర్గంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీని అందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో చెన్నూర్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమష్ఠిగా పని చేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచుదామని చెప్పారు. అతి త్వరలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించుకునీ, ప్రతీ గ్రామంలో పర్యటించేలా ప్రణాళిక రూపొందించుకుందామని పేర్కొన్నారు. బొగ్గుగని కార్మికులు సమస్యలు పరిష్కరించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.

190
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...