డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య


Sat,September 8, 2018 01:10 AM

దండేపల్లి : మండలంలోని రెబ్బెన్‌పెల్లి గ్రామానికి చెందిన అల్లంల అనిత(18) అనే డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ సంజీవ్, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిత లక్షెట్టిపేట పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నది. ఈ మధ్య తండ్రి పోషన్న కూతురును చదు వు మధ్యలోనే ఆపేయాలనీ, వ్యవసాయ పనులకు ఆసరగా ఉండాలని చెప్పాడు. చదువు మధ్యలో ఆపేయలేక, వ్యవసా య పనులకు వెళ్లడం ఇష్టం లేక మనస్తా పం చెంది బుధవారం తెల్లవారుజాము న 3 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మం చిర్యాల దవాఖానకు తరలించారు. చికి త్స పొందుతూ గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతిచెందింది. తండ్రి పోషన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...