పంచాయతీల్లో కొలువులు


Fri,September 7, 2018 01:06 AM

-ఉమ్మడి జిల్లాలో 1,124 జీపీ కార్యదర్శి పోస్టులు
-ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ
నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : నూత న పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం పల్లెల్లో పూర్తిస్థాయిలో అధికారులను నియమించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రా మపంచాయతీకి కార్యదర్శులను నియమించేందుకు చర్య లు చేపట్టారు. ఇందుకుగాను కొత్త, పాత గ్రామపంచాయతీల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమిస్తున్నారు. మూడేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత రెగ్యులర్ చేయనున్నారు. ఉమ్మడి జి ల్లాలో 1124 పోస్టులు భర్తీ చేస్తుండగా, ఇందులో 384 పోస్టులను మహిళలకు రిజర్వ్ చేశారు. జనరల్ స్థానాలతో పాటు రిజర్వు కోటాలో ఉద్యోగాలు దక్కనుండడంతో మహిళలకు ఎక్కువ అవకాశం లభిం చనుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఏండ్లుగా గ్రామ పంచాయతీ కార్యదర్శలు పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఏండ్ల తరబడి ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో గ్రామాల్లో పర్యవేక్షణ కొరవడి ఇబ్బందిగా మారింది. గ్రామాల్లో అభివృద్ధి మాట అటుంచితే జనాల సాధారణ సమస్యలు, రోజువారీ అవసరాలు కూడా తీరలేదు. మూడు, నాలుగు గ్రా మ పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండడంతో పల్లెల్లో ప్రగతి పూర్తిగా కుంటుపడింది. ఇక వివిధ సమస్యలు సకాలంలో పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్‌చార్జి బాధ్యతలు ఉండడంతో తమ పరిధిలోని గ్రామాల్లో ప న్ను వసూళ్లు కూడా ఇబ్బందికరంగా మారింది. పూ ర్తి స్థాయిలో గ్రామ కార్యదర్శులు లేకపోవడంతో .. ఉన్న వారిపై పని ఒత్తిడి పెరిగింది.

గ్రామ స్థాయిలో ఆయా గ్రామాల పరిశుభ్రత, పన్ను ల వసూళ్లు, మురికి కాల్వల నిర్వహణ, విద్యుత్ దీపాల నిర్వహణ, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం, దోమల నివారణ, స్మశాన వాటికల నిర్వహణ, డంప్‌యార్డుల ఏర్పాటు తదితర వాటంటిన్ని గ్రామ కార్యదర్శి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఒక్కో కార్యదర్శికి మూడు, నాలుగు గ్రామపంచాయతీలకు ఇంఛార్జీగా ఉండటంతో పర్యవేక్షణ, పన్నుల వసూ ళ్లు ఇబ్బందికరంగా మారాయి. తాజాగా కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయడంతో గ్రామపంచాయతీల సం ఖ్య భారీగా పెరిగింది. నిర్మల్ జిల్లాలో గతంలో 240 గ్రామ పంచాయతీలకుగాను.. 74 మంది ఉన్నారు. ఇందులో 65 మంది మాత్రమే పని చేస్తుండడంతో.. ఒక్కొక్కరికీ నాలుగైదు గ్రామా ల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా గ్రామ పంచాయతీల సంఖ్య 396 కు చేరగా.. కొత్త గా మరో 322మంది వరకు భర్తీ చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో 243 గ్రామ పంచాయతీలకు 137మంది ఉన్నారు. ప్రస్తు తం గ్రామ పంచాయతీల సంఖ్య 467కు చేరడంతో.. మరో 335మందిని కొత్తగా నియమించనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో గతంలో 173 గ్రామపంచాయతీలుండగా, కొత్తగా 161 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారు. దీంతో వీటి సం ఖ్య 334కు చే రింది. ప్రస్తుతం జిల్లాలో 101 మంది గ్రామ కార్యదర్శు లు పనిచేస్తున్నారు. దీంతో తాజాగా మరో 235మంది గ్రామ కార్యదర్శులు నియమించేం దుకు నిర్ణయించారు. మంచిర్యాల జిల్లాలో 210 పాత గ్రామపంచాయతీలుండగా, 84 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. కొత్తగా 115 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయ గా.. నాలుగు గ్రామపంచాయతీలను తీసేయగా.. 311కు చేరింది. దీంతో కొత్తగా 232 గ్రామ కార్యదర్శులను నియమించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 1124 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించనున్నారు.

ఆన్‌లెన్‌లో దరఖాస్తుల స్వీకరణ
అన్ని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కూడా తీసుకున్న సానుకూల నిర్ణయం గ్రామాల అ భివృద్ధికి మేలు చేయనుంది. ఈ కార్యదర్శుల నియామాక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈనెల 3 నుంచి 12 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత వారి పనితీరు బట్టి వారిని క్రమబద్ధ్దీకరించేలా నిర్ణయం తీసుకుంటారు. సమర్థవంతంగా వి ధులు నిర్వహించని వారిని క్రమబద్దీకరించకుండా ఉండేలా నిబంధనలు రూపొందించారు. కొత్తగా నియామకం కానున్న గ్రామ కార్యదర్శులకు ప్రొబేషనరీ సమయంలో నెలకు రూ.15 వేల జీతం చెల్లిస్తారు. ఉమ్మడి జిల్లాలో 1124 పోస్టులను భర్తీ చే స్తుండగా, ఇందులో 740పోస్టులు జనరల్ ఉండ గా.. 384 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శుల్లో మహిళలు ఎక్కు వ మంది ఉండనున్నారు. జనరల్ పోస్టులతో పాటు రిజర్వేషన్‌లోనూ మహిళలకు ఉద్యోగాలు రానున్నాయి. ఇక ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం, బీసీ(ఏ)కు 7శాతం, బీసీ(బి) 10శాతం, బీసీ(సి) 1శాతం, బీసీ (డీ) 7శాతం, బీసీ (ఇ) 4శాతం, వికలాంగులకు 3శాతం, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 2శాతం, స్పోర్ట్స్ కోటాలో 2శాతం ఆన్‌రిజర్వ్ కోటాలో 45 శాతం పోస్టులు ఉన్నాయి.

ఆదిలాబాద్‌లో..
జిల్లాలో 335 పోస్టులకు గాను 221 జనరల్ పో స్టులు, 114 మహిళలకు రిజర్వ్ చేశారు. 335 పోస్టు ల్లో ఎస్సీల్లో జనరల్ 33, మహిళలు 17 పోస్టులు, ఎస్టీల్లో జనరల్ 14, మహిళలు 7 పోస్టులు, బీసీ (ఏ)లో జనరల్ -17, మహిళలు-7, బీసీ (బి)ల్లో జనరల్ 20, మహిళలు 13 పోస్టులు, బీసీ (సి)ల్లో జనరల్ 3, మహిళలు -01, బీసీ (డి)ల్లో జనరల్ -15, మహిళలు-7, బీసీ(ఇ)ల్లో జనరల్ -9, మ హిళలు-4, దివ్యాంగుల్లో జనరల్ 7, మహిళలు -4, ఎక్స్ సర్వీస్‌మెన్ జనరల్ -7, స్పోర్ట్స్ కోటాలో -6 పోస్టులు, అన్‌రిజర్వ్‌డ్ కోటాలో జనరల్-90, మహిళలకు 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

నిర్మల్‌లో..
జిల్లాలో 322 పోస్టులకుగాను 211 జనరల్ పో స్టులు, 111 మహిళలకు రిజర్వ్ చేశారు. 322 పోస్టు ల్లో ఎస్సీల్లో జనరల్ 32, మహిళలు 17 పోస్టులు, ఎస్టీల్లో జనరల్ 12, మహిళలు 7 పోస్టులు, బీసీ (ఏ)లో జనరల్ -16, మహిళలు-7, బీసీ (బి)ల్లో జనరల్ 18, మహిళలు 13 పోస్టులు, బీసీ (సి)ల్లో జనరల్ 3, మహిళలు -1, బీసీ (డి)ల్లో జనరల్ -15, మహిళలు-7, బీసీ(ఇ)ల్లో జనరల్ -9, మ హిళలు-4, దివ్యాంగుల్లో జనరల్ 6, మహిళలు -4, ఎక్స్ సర్వీస్‌మెన్ జనరల్ -7, స్పోర్ట్స్ కోటాలో -6 పోస్టులు, అన్‌రిజర్వ్‌డ్ కోటాలో జనరల్-87, మహిళలకు 51 పోస్టులు ఉన్నాయి.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో..
జిల్లాలో 235 పోస్టులకుగాను 155 జనరల్ పోస్టులు, 80 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేశారు. 235 పోస్టుల్లో ఎస్సీల్లో జనరల్ 23, మహిళలు 12 పోస్టులు, ఎస్టీల్లో జనరల్ 10, మహిళలు 5 పోస్టు లు, బీసీ (ఏ)లో జనరల్ -12, మహిళలు-5, బీసీ (బి)ల్లో జనరల్ 14, మహిళలు 9 పోస్టులు, బీసీ (సి)ల్లో జనరల్ 2, మహిళలు -1, బీసీ (డి)ల్లో జనరల్ -10, మహిళలు-5, బీసీ(ఇ) ల్లో జనరల్ -6, మహిళలు-3, దివ్యాంగుల్లో జనరల్ 6, మహిళలు -2, ఎక్స్ సర్వీస్‌మెన్ జనరల్ -5, స్పోర్ట్స్ కోటాలో -4 పోస్టులు, అన్‌రిజర్వ్‌డ్ కో టాలో జనరల్-63, మహిళలకు 38 పోస్టులు ఉన్నాయి.

మంచిర్యాలలో..
జిల్లాలో 232 పోస్టులకుగాను 153 జనరల్ పో స్టులు, 79 మహిళలకు రిజర్వ్ చేశారు. 232 పోస్టు ల్లో ఎస్సీల్లో జనరల్ 23, మహిళలు 12 పోస్టులు, ఎస్టీల్లో జనరల్ 09, మహిళలు 5 పోస్టులు, బీసీ (ఏ)లో జనరల్ -12, మహిళలు-5, బీసీ (బి)ల్లో జనరల్ 13, మహిళలు 9 పోస్టులు, బీసీ (సి)ల్లో జనరల్ 2, మహిళలు -1, బీసీ (డి) ల్లో జనరల్ -10, మహిళలు-5, బీసీ(ఇ)ల్లో జనరల్ -6, మహిళలు-3, దివ్యాంగుల్లో జనరల్ 6, మహిళలు -2, ఎక్స్ సర్వీస్‌మెన్ జనరల్ -5, స్పోర్ట్స్ కోటాలో -4 పోస్టులు, అన్‌రిజర్వ్‌డ్ కోటాలో జనరల్-63, మ హిళలకు 37 పోస్టులు ఉన్నాయి.

జిల్లా ఖాళీలు జనరల్ మహిళలు
ఆదిలాబాద్ 335 221 114
కుమ్రం భీం ఆసిఫాబాద్ 235 155 80
నిర్మల్ 322 211 111
మంచిర్యాల 232 153 79
మొత్తం 1,124 740 384

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...