మొక్కలు నాటడం మన అందరి బాధ్యత


Fri,September 7, 2018 01:05 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : మొక్కలు నాటడం మన అందరి బాధ్యతగా భావించాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల అశ్రమ పాఠశాలలో గురువారం హరితహారం నిర్వహించారు. విద్యార్థులు, అధికారులు, జర్నలిస్టులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఈరోజు మనం నాటిన మొక్కలే రేపు మన తరాలకు,మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కలను సంరక్షించాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దత్తత తీసుకొని సంరక్షించాలన్నారు. ప్రభుత్వం హరితహారంను పకడ్బందీగా నిర్వహిస్తుందని అన్నారు. కలెక్టర్‌తో మొక్కలు నాటడానికి విద్యార్థులు పోటీ పడ్డారు. మొక్కలు నాటిన అనంతరం విద్యార్థులు కలెక్టర్‌తో సెల్ఫీలు దిగి సంతోషం వ్యక్తం చేశారు. జర్నలిస్టుడే సందర్భంగా మొక్కను నాటాలని జర్నలిస్టులు కలెక్టర్‌కు విన్నవించగా జర్నలిస్టులతో కలిసి మొక్కను నాటారు.హరితహారం కార్యక్రమంలో డీఎఫ్‌వో రామలింగం,డీటీడీవో మాడావి గంగారాం,డీఆర్‌డీఏ అదనపు పీడీ శంకర్, ఏటీడీవో నీలిమ,ప్రధానోపాద్యాయుడు అంబారావు,ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...