మార్కులు కాదు.. జ్ఞానం కావాలి


Fri,September 7, 2018 01:05 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : విద్యార్థులకు మార్కులు ముఖ్యం కాదని, జ్ఞానం కావాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, హాస్టల్‌ను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయుడు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.పదోతరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ ఎలా చదువుతున్నారు, భోజనం ఎలా పెడుతున్నారు, స్టడీ అవర్స్ ఎలా జరుగుతున్నాయి, మీ జీవిత లక్ష్యం ఏంటి అని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. తొమ్మిదో తరగతి గదిరి వెళ్లి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. ఓ విద్యార్థినిని పిలిచి ఇంగ్లీష్ పాఠం చదవమన్నారు. ఆమె ఇబ్బంది పడుతుంటే తెలుగు పుస్తకం ఇచ్చారు. కలెక్టర్ తెలుగు పుస్తకం పట్టుకొని నామాతృభాష కన్నడమైనా తెలుగు చదువగలని చదివి వినిపించారు. అనంతరం విద్యార్థిని బోర్డుపై ఏబీసీడీలు అన్ని రాయమని చెప్పగా విద్యార్థిని అందులో కొన్ని అక్షరాలు రాయలేదు. చదువంటే భయం వద్దని కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని కలెక్టర్ తెలిపారు. రెగ్యులర్ ఇంగ్లిష్ టీచర్‌ను వార్డెన్‌గా నియమించడంతో బిజీగా ఉందని సీఆర్‌టీని నియమించి బోధన చేయిస్తున్నామని ఏటీడీవో నీలిమ కలెక్టర్‌కు తెలిపారు. ఇంగ్లీష్ టీచర్‌ను ప్రశ్నించగా తాను ఇటీవలే వచ్చానని తెలిపారు. బాగా చదివించాలని డీటీడీవో గంగారంను,ఏటీడీవోను కలెక్టర్ ఆదేశించారు.

హెల్త్ సెంటర్,వంటగది పరిశీలన
పాఠశాలలోని కాల్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించి విద్యార్థులకు చేస్తున్న పరీక్షల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు అరోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అదేశించారు. పాఠశాలలోని వంటగదిని కలెక్టర్ పరిశీలించారు. వంటగదిలో పనిచేసే వర్కర్స్‌తో మాట్లాడారు. శుభ్రత పాటించాలని సూచనలు చేశారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...