పట్టాభిషేకం


Thu,September 6, 2018 01:02 AM

సింగరేణి భూములకు సంబంధించి తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ నివాసం ఉంటున్న కార్మికులు, కార్మికేతరులకు అధికారం కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఫలితంగా 789 ఎకరాల్లో ఆశ్రయం పొందుతున్న దాదాపు 11,114 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో శ్రీరాంపూర్ ఏరియాలోనే దాదాపు 3,800 మందికి, బెల్లంపల్లి, మందమర్రిలో కూడా 6,500 మందికి పట్టాలు అందనున్నాయి. సింగరేణి యాత్రలో భాగంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణి భూములను క్రమబద్ధీకరిస్తున్నారు. మంగళవారం రాత్రి ఫైలుపై సంతకం కాగా, జీవోను బుధవారం విడుదల చేశారు. దశాబ్దాల కల నెరవేరిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

(మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాలకు సంబంధించి ప్రభుత్వం బుధవార కీలక నిర్ణయం తీసుకుంది. సిం గరేణి ప్రాంతంలో నివాసం ఉంటున్న కా ర్మికులు, కార్మికేతరులకు ఆ భూమిపై వారి కే అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకున్నా రు. దీంతో జిల్లాలో దాదాపు 11,114 కు టుంబాలు లబ్ధిపొందనున్నాయి. ఏండ్లుగా తమ ఇండ్లను క్రమబద్ధీకరణ చేయాలని కోరుతున్నా వారి గురించి పట్టించుకునే నాథుడే లేడు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాంపూర్ బహిరంగ సభలో సింగరేణి ప్రాంతంలో ఉన్న వారి స్థలాలు క్రమబద్ధీకరించే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రే ఆ ఫైలుపై సం తకం చేయగా, బుధవారం జీవో విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 789.24 ఎకరాల్లో ఉన్న స్థలాలను క్రమబద్దీకరించనున్నారు. సింగరేణి ప్రాంతంలో నివసిస్తు న్న వారికి ఇక్కడ పట్టాలు ఇవ్వాలని ఏం డ్లుగా డిమాండ్ ఉంది. ఈ జిల్లాలో తూ ర్పు ప్రాంతం అంతా సింగరేణి విస్తరించి ఉంది. బెల్లంపల్లి కేంద్రంగా 1926 ప్రాం తంలో బొగ్గు గనుల ప్రస్థానం ప్రారంభ మైంది. అప్పటి అవసరాల కోసం సంస్థ బెల్లంపల్లి మండలం బూదాకలాన్ గ్రామ శివారు సర్వే నంబర్ 170లో ఉన్న వేలాది ఎకరాల భూమిని లీజుకు తీసుకుంది. ఆ భూమిలో కొన్ని చోట్ల గనులు, విభాగాలు, నివాసాల కోసం క్వార్టర్లను నిర్మించింది. గనులు మూతపడి, విభాగాల ఎత్తివేతకు గురయ్యాయి. బెల్లంపల్లిలో దాదాపు 15 సంవత్సరాలుగా సింగరేణి కార్యకలాపాలు పెద్దగా లేవు. దీంతో ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్న ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి భూ యాజమాన్యపు హక్కు కల్పించాలనీ, మాజీ కార్మికులకు పాత క్వార్టర్లను స్వాధీ నం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. రా ష్ట్రం ఏర్పాటైన తర్వాత కార్మికులు, కార్మికేతరులు ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా ఈ అంశం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి ఎంతగానో ఉపయోగపడింది. మందమర్రి, శ్రీరాంపూర్‌లో కూడా తమకు పట్టాలివ్వాలని ఏండ్లు గా ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సీ మాంధ్ర ప్రభుత్వాలు వారి డిమాండ్ పట్టించుకోలేదు.

పూర్తయిన సర్వే


సీఎం హామీ మేరకు సింగరేణి భూము లను సర్వే చేయాలని కలెక్టర్, అధికారుల కు ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల సర్వే తర్వాత సీసీఎల్‌ఏకు నివేదిక పంపించారు. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూ ర్ ఏరియాల్లో ఉన్న భూములకు సంబంధించి ఎంత మంది నివాసం ఉంటున్నా రు.? జిల్లా వ్యాప్తంగా ఎంత భూమి అవసరం ఉంటుంది? ఇలా అన్ని అంశాలను పరిశీలించారు. సంస్థ లీజు భూమి, ఖాళీ స్థలాలను పరిశీలించిన అధికారులు యజ మాని పేరు, ఇంటి అడుగు విస్తీర్ణం తదిత రాలను నమోదు చేసుకున్నారు.

789 ఎకరాలు.. 11,114 కుటుంబాలు..


సీసీఎల్‌కు అందించిన నివేధిక ప్రకారం 789 ఎకరాల్లో 11,114 కుటుంబాలు ని వాసం ఉంటున్నట్లు లెక్క తేల్చారు. వీరందరికీ లబ్ధి చేకూరనుంది. పట్టణంలోని క న్నాల బస్తీ, టేకుల బస్తీ, బజారు ఏరియా, హన్మాన్ బస్తీ, మహ్మద్‌ఖాసీం బస్తీ, బూడిదగడ్డ బస్తీ, బెల్లంపల్లి బస్తీ, నంబర్-2 ఇైంక్లెన్ బస్తీ, అశోక్‌నగర్, రాంనగర్ బస్తీ, తదితర ప్రాంతాల వాసుల్లో ఉంటున్న వా రికి మేలు జరిగే అవకాశం ఉంది. శ్రీరాంపూర్‌లోని సింగాపూర్ పంచాయతీలోని అరుణక్కనగర్‌లో 66.28 ఎకరాలు, తాళ్లపల్లి వాటర్ ట్యాంక్ ఏరియాలో 12 ఎకరాల, పట్టా భూమిలో ఉన్న 19.35 ఎకరాలు, నస్పూరు సుందరయ్యనగర్ ,ఆర్‌కే 5 కాలనీలో 19 ఎకరాలు, ఆర్‌కే 6 గుడిసెల్లో 45 ఎకరాల సింగరేణి స్థలాల నివాసులకు పట్టాలు అందనున్నాయి. కేవలం శ్రీరాంపూర్ ఏరియాలోనే దాదాపు 3 వేల 800 మంది వరకు పట్టాలు అందనున్న ట్లు సమాచారం. బెల్లంపల్లి, మందమర్రి లో కూడా 6వేల 500 మంది వరకు లబ్ధి చేకూరనుంది.

భూముల క్రమబద్ధీకరణ ఇలా..


ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా జీవోలో స్పష్టంగా పేర్కొన్నా రు. జీవో నంబర్ 58, 59 ప్రకారం క్రమబద్ధీకరించనున్నట్లు వెల్లడించారు. 125 గజాల లోపు ఉన్న వారికి బీపీఎల్ కింద ఉచితంగానే క్రమబద్ధీకరిస్తారు. వారికి సం బంధించి గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డు ఏదైనా), రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ప్రాపర్టీ టాక్స్ ప్రతి, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు సమర్పించాలి. పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. లక్షా 50వేలు వరకు ఉన్న వారిని బీపీఎల్ కుటుంబాలు గా గుర్తిస్తారు. 125 గజాల కంటే ఎక్కువ ఉన్న వారిని ఏపీఎల్ కింద నిర్ధారిస్తారు. ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలి. దరఖాస్తు దారులు భూమి విలువలో 25 శాతం చలాన్, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలల్లోగా రెండు విడతలుగా చెల్లించే అవకాశం ఉంది.

పట్టాలివ్వడం సంతోషం


నా పేరు ఎరగొక్కుల నారాయణ. నేను సుందరయ్య కాలనీలో పదేళ్లుగా నివాసం ఉంటున్న. కూలీ పని చేస్తేగాని ఇల్లు గడవని పరిస్థితి. అప్పు చేసి చిన్న ఇల్లు కట్టుకున్న. పట్టాలేదని భయంగా ఉండేది. ఏళ్లుగా పట్టా కోసం ఎదురు చూస్తున్న. గత పాలకులు పట్టాలిస్తామని దిగిపోయిండ్రు. కేసీఆర్ సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నడు. ఇప్పుడు మా భూమిపై మాకు అధికారం కల్పిస్తూ పట్టా ఇస్తున్నడు. సీఎం అంటే కేసీఆరే.శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల్లో సింగరేణి భూముల్లో నివాసం ఉంటున్న కార్మికులు, కార్మికేతరులకు పట్టాలు ఇవ్వాలి. వారు నివాసం ఉంటున్న భూములను క్రమంగా క్రమబద్ధీకరించాలి. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పరిష్కరించాలి. పట్టాలు ఇస్తరో లేదోనని భయం భయంగా వారు బతుకొద్దు. వారికి పట్టాలు త్వరగా అందేట్టు సింగరేణీ సీఎండీ శ్రీధర్ చూడాలి.

157
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...