ఆదిలాబాద్ సర్కిల్‌లోకి కుప్టి


Thu,September 6, 2018 12:02 AM

-ఎస్సారెస్పీ సీఈ నుంచి బదలాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
-మరో 29 కొత్త చెరువుల బాధ్యతల అప్పగింత
నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్టులు) ఆదిలాబాద్ సర్కిల్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణం చేపట్టే కొత్త పనులను ఈ సర్కిల్‌కు బదలాయిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టి వద్ద నిర్మించే కుప్టి బహుళార్థక సాధక ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి జిల్లాలో నిర్మిస్తున్న 29 కొత్త చెరువులను చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్టులు) ఆదిలాబాద్ సర్కిల్ పరిధిలోకి తెస్తూ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేరడిగొండ మండలం కుప్టి వద్ద రూ.794.33కోట్ల వ్య యంతో బహుళార్థక సాధక ప్రాజెక్టును నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. ఇందుకు సంబంధించి పరిపాలన అనుమతులు ఇస్తూ మే 3, 2018న నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు జీఓ ఎంఎస్ నెం.34ను జారీ చేశారు. వాస్తవానికి ఇప్పటి వరకు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎస్సారెస్పీ-1 పరిధిలో ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ స లం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 40కిమీ దూరంలో ఉంది. ఎస్సారెస్పీ-1 సీఈ ప్రధాన కార్యాలయం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం నుంచి సీఈ కార్యాలయం 200కి.మీ కు పైగా దూరంలో ఉంది. దీంతో పర్యవేక్షణ ఇబ్బందికరంగా ఉండనుంది. 2015లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రగతిలో ఉన్న ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనుల పర్యవేక్షణకు ఆదిలాబాద్ కేంద్రంగా ప్రాజెక్టుల సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి చీఫ్ ఇంజినీర్‌ను నియమించారు.

దీంతో 40కి.మీ దూరంలోని ఆదిలాబాద్ ప్రాజెక్టుల సీఈ సర్కిల్‌కు కుప్టి ప్రాజెక్టును బదలాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ ఈఈ, ఐబీ డివిజన్ ఆదిలాబాద్ పరిధిలో ఉండగా, ఎస్‌ఈ ఇరిగేషన్ సర్కిల్ నిర్మల్ పరిధిలో యధావిధిగా కొనసాగనుంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కొత్త చెరువులను నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 47 కొత్త చెరువులను నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది. నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో నిర్మించే 29 చెరువులను ఇప్పటికే స్టేజ్-1 అనుమతులిచ్చారు. ఇప్పటివరకు ఈ కొత్త చెరువులు చీఫ్ ఇంజినీర్, మైనర్ ఇరిగేషన్(గోదావరి బే సిన్) పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మరో 18 కొత్త చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. ఈ కొత్త చెరువుల పర్యవేక్షణ ఈఈ, ఐబి డివిజన్ ఆదిలాబాద్ పరిధిలో ఉం డ గా ఎస్‌ఈ ఇరిగేషన్ సర్కిల్ నిర్మల్ పరిధిలో యధావిధిగా కొనసాగనుంది. ఇప్పటికే ఉన్న చెరువులను సీఈ, మైనర్ ఇరిగేషన్ పరిధిలోనే కొనసాగిస్తారు. జలయజ్ఙంలో భాగంగా చేపట్టిన పలు ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొన్నింటిని ఇప్పటికే పూర్తి చేసింది. ఇప్పటికే ర్యాలీవాగు, గొల్లవాగు, మత్తడి వాగు ప్రాజెక్టులు పూర్తి చేశారు. మరో ఏడాదిలో మిగతావి పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల సర్కిల్‌కు కొత్త ప్రాజెక్టులు, చెరువులను అప్పగిస్తున్నారు. పర్యవేక్షణను మరింత పెంచి పనులు వేగం గా పూర్తి చేయాలని లక్ష్యంతో ఈ బదలాయింపు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...