రేపు పెళ్లనగా..!


Thu,September 6, 2018 12:01 AM

-కుటుంబ సభ్యులను విడిచి దూరం వెళ్లలేక యువతి ఆత్మహత్య
-పెళ్లికి ఒకటి రోజు ముందు అఘాయిత్యం..
-జన్నారంలో విషాదం
-శోకసంద్రంలో కుటుంబం
జన్నారం : పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. బంధువుల సందడితో కళకళలాడాల్సిన చోట చావు డప్పు మోగింది. పెళ్లి చేసుకొని కుటుంబసభ్యులను విడిచి దూరం వెళ్లడం ఇష్టం లేదంటూ యువతి ఆత్మహత్య చేసుకుంది. జన్నా రంలో బుధవారం జరిగిన ఈ హఠాత్పరిణామంతో ఆ కుటుంబం శోకసంద్రం లో మునిగిపోయింది. ఎస్‌ఐ తైహిసినోద్దిన్ తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలకేంద్రానికి చెందిన టేకుమట్ల ఆమని(28) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లాలో ఎస్‌బీఐలో పనిచేస్తున్న తమ కూతురికి ఈ నెల 6న దండేపల్లి మండలం ద్వారక గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు పంకజ, రాజన్న నిశ్చయించారు. వరుడు ముంబైలో ఉద్యోగం చేస్తుండగా, కుటుంబసభ్యులను విడచి అంతదూరం వెళ్లడం ఇష్టం లేక మనోవేదనతో మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ విషయం తెలుసుకుని బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి రోదనలు చూసిన వారు కంటతడి పెట్టుకున్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...