పులి దాడిలో ఎద్దుకు గాయాలు


Thu,September 6, 2018 12:01 AM

కోటపల్లి : కోటపల్లి మండలంలోని పంగిడిసోమారం అటవీ ప్రాంతంలో ఎద్దు పై పులి దాడి చేయడంతో ఎద్దకు గాయాలయ్యాయి. బావనపల్లి గ్రామానికి చెందిన మంత్రి రామయ్యకు చెందిన ఎద్దు మేత కోసం పంగిడిసోమారం అటవీ ప్రాంతంలోకి వెళ్ళగా వెనుక వైపు నుండి పులి ఒక్కసారిగా దాడి చేసింది. దాడిలో ఎద్దు వీపు బాగంలో పులి పంజాతో తీవ్ర గాయం కాగా ఎద్దు ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది. దాడి విషయాన్ని రైతు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమా చారం అందించగా చెన్నూర్ ఫారెస్టు డివిజన్ అధికారి రాజారాం, కోటపల్లి అటవీ రేంజ్ అధికారి రవిలు సందర్శించి వివరాలను సేకరించారు. పులి దాడిలో గాయపడిన ఎద్దుకు అటవీ అధికారులు ప్రథమ చికిత్స చేయించారు. కాగా పంగిడిసోమారం అటవీ ప్రాంతంలో పులి కదలికలు మళ్లీ కనిపించడంతో నక్కలపల్లి, పంగిడిసోమారం గ్రామాల ప్రజలకు కలవరపడుతున్నారు. ఈ గ్రామాలకు వెళ్లాలంటే ఇదే అటవీ గుండా వెళ్లాల్సి ఉండగా పులి సంచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...