పౌష్టికాహారం తీసుకోవాలి


Thu,September 6, 2018 12:01 AM

శిశు, మహిళా సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్ అత్తి సరోజ
గర్మిళ్ల : అందరూ పౌష్టికాహారం తీసుకోవాలని కోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని శిశు, మహిళా సంక్షేమశాఖ జిల్లా ఆర్గనైజర్ అత్తి సరోజ సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నిర్వహించే జాతీయ పోషణ అభియాన్‌లో భాగంగా బుధవారం జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్‌ఖాన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీ తీశారు. ఇక్కడ ఆమె మాట్లాడుతూ, శిశువు నుంచి వృద్ధుల వరకు అందరు సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే వ్యాధులు దరి చేరవన్నారు. అం గన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కిశోర బాలికలకు కూడా పౌష్టికాహారం అందింస్తామని వెల్లడించారు. అనారోగ్యరహిత దేశంగా గుర్తింపు వచ్చే విధం గా అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్‌ఖాన్ సీడీపీవో ఆశాలత, సూపర్‌వైజర్లు సల్మా, బీజాన్‌బీ, ప్రస న్న, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...