పెట్రో మంట


Wed,September 5, 2018 01:31 AM

-పెరుగుతున్న డీజిల్, పెట్రోలు ధరలు
-వాహనదారుల జేబులకు చిల్లు
-నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిన్న ఉన్న ధర ఈ రోజు ఉండటంలేదు, ఈ రోజు న్న ధర రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. గడిచిన ఆరునెలల కాలంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. దీంతో వాహనదారులపై పెను ఆర్థికభారం పడుతున్నది. తప్పనిసరైన పరిస్థితుల్లో మాత్రమే వాహనాలను బయటకు తీసే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 42 పెట్రోలు బంకులు న్నాయి. నెలలో దాదాపుగా జల్లా మొత్తంమీద 1000 కిలోలీటర్ల పెట్రోల్, 2500 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. మంగళవారం మంచిర్యాలలో లీటరు పెట్రోలు ధర రూ. 84.84 లు ఉండగా, లీటరు డీజిల్ ధర రూ. 78.28 లు ఉంది. గడిచిన 20 రోజులు కాలంలో పెట్రోలుపై రూ. 2.23 లు పెరుగగా, డీజిల్‌పై రూ. 2.90లు పెరిగింది. పెట్రోలు, డీజిల్ ధరలు దాదాపుగా దరిదాపులకు చేరుకుంటున్నాయి. డాలరు మారకం విలువ రూ.71.12కు చేరుకున్న నేపథ్యంలో సోమవారం గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయికి పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. రూపాయి మారకం విలువ పెరుగడంతో పాటు ముడి చమురు ధర కూడా భారీగా పెరగడం కూడా కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు.

గడిచిన 20 రోజుల్లో ధరలు

తేదీ పెట్రోలు (రూ) డీజిల్(రూ)

ఆగస్టు 15 82.49 75.38
ఆగస్టు 20 82.86 75.75
ఆగస్టు 25 83.05 75.90
ఆగస్టు 31 83.95 77.02
సెప్టెంబర్ 4 84.84 78.28

149
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...