వివాహిత ఆత్మహత్య


Wed,September 5, 2018 01:30 AM

వేమనపల్లి : వివాహిత పురుగుల మం దు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని నాగారం గ్రామంలో జరి గింది. నీల్వాయి ఎస్‌ఐ భూమేశ్ కథనం ప్రకారం.. ఉడుత సుమలత (22)కు నాలుగు నెలల క్రితం కోటపల్లి మండలం బోరెంపల్లి గ్రామానికి చెందిన ఉడుత శేఖర్‌తో వివా హం జరిగింది. నెల రోజులు సంసారం సాఫీగా సాగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పుట్టింటి వద్దనే ఉంటుంది. ఈ నెల 1వ తేదీన తండ్రి దొంతుల మల్లయ్య అత్తగారింటికి వెళ్లాలని సుమలతను మందలించడంతో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు మంచిర్యాలలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ప్రభుత్వ దవఖానకు తరలించగా చికిత్స పొందు తూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...