ఉద్యమ మహిళగా విజయారెడ్డి..


Mon,March 6, 2017 11:00 PM

కోటపల్లి : కోటపల్లి మండలం బబ్బెరచెలుక గ్రామానికి చెందిన, టీఆర్‌ఎస్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మూల విజయారెడ్డి ఈ అవార్డు అందుకోనుంది. మూల భాస్కర్‌రెడ్డిని పెళ్లి చేసుకున్న విజయ వృత్తి రీత్యా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో స్థిరపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్‌లలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు కోటపల్లి మండలానికి వచ్చి, ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యులను చేశారు. రైలురోకో, ఐఎన్టీయూసీ కార్యాలయ ధ్వంసంలో ఆమెపై రెండు కేసులు సైతం నమోదయ్యాయి. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టే సమయంలో ఢిల్లీలోనే ఉండి, 12 రోజులపాటు ఆందోళనలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు నిరసనగా ఢిల్లీలోని విజయచౌక్‌లో ధర్నా చేస్తున్న విజయారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కరోజు జైలులో ఉన్నా రు. ఇందుకు గాను ఆమెను తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇచ్చి, సత్కరించనుండడంతో బబ్బెరచెలుక ప్రజలతో పాటు కోటపల్లి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...