అట్టహాసంగా..


Thu,December 5, 2019 02:49 AM

మహబూబ్‌నగర్‌ 129వ ఆవిర్భావ దినోత్సవం
హాజరైన రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ ఖమృద్దీన్‌
హిందూ ముస్లింకలిసిమెలిసి ఉంటారని ఉద్ఘాటన
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న వక్తలు

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : మహబూబ్‌నగర్‌ 129వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ టౌన్‌హాల్‌లో అట్టహాసంగా నిర్వహించారు. నవాబ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ బహద్దూర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అబ్దుల్‌ రహీం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ ఖమృద్దీన్‌తోపాటు, ఆయా మతాల ప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా నిజాం చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి సర్వమత ప్రార్థనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఖమృద్దీన్‌ మాట్లాడుతూ ఇక్కడ గంగా జ మున తహ్‌జిబ్‌లా హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉంటారన్నారు. మహబూబ్‌నగర్‌ అంటే ప్రేమ, ఆప్యాతయాలకు నిలయమని, అది పేరులోనే ఉందని గుర్తు చేశారు. నైజాం ప్రాంతం చారిత్రాత్మకంగా, సంస్కృతికంగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

తెలంగాణ ఉ ద్యమ సమయంలో కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేస్తే గెలిచింపించిన ఘనత మహబూబ్‌నగర్‌ ప్ర జలకే దక్కిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రతి ఏటా మహబూబ్‌నగర్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ని ర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం టీ న్యూస్‌ ప్రతినిధి మహ్మద్‌ ఖయ్యూం అన్వర్‌ మాట్లాడుతూ ప్రతి ఏడాది మహబూబ్‌నగర్‌ ఆవిర్భావ వేడుకలను అబ్దుల్‌ రహీం ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కులమతాలకు అ తీతంగా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవం తం చేశారని తెలిపారు.

అనంతరం వీహెచ్‌పీ సెక్రటరీ లక్ష్మారెడ్డి , షాషాబ్‌గుట్ట దర్గా పీఠాధిపతి సయ్యద్‌ అ బ్దుల్‌ రజాక్‌షా ఖాద్రి, రెవరెండ్‌ వరప్రసాద్‌తో పాటు మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఖమృరుద్దీన్‌, టీన్యూ స్‌ ప్రతినిధి మహ్మద్‌ ఖయ్యూం అన్వర్‌లను అబ్దుల్‌ ర హీం ఘనంగా సన్మానించారు. అలాగే, మున్సిపల్‌ కా ర్మికులను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా హజ్‌ సొసైటీ అధ్యక్షుడు మహమూద్‌ అలీ, మహ్మద్‌ ఖదీర్‌ సిద్దిఖీ, నయూముల్లా షరీఫ్‌, ఎంఏ ఘనీ, హలీం బా బార్‌, సాదుఖుల్లా, రషీద్‌ రహెబార్‌, కుతుబుద్దీన్‌, షో యేబ్‌ అలీ, మహ్మద్‌ ఖలీల్‌, రహెమాన్‌, మహ్మద్‌ జ హెద్‌, నాగభూషణం, జహంగీర్‌ పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...