దవాఖానలను స్టాండర్డ్‌గా మారుస్తాం


Thu,December 5, 2019 02:47 AM

-మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తాం
-అవసరమైన నిధులను కేటాయిస్తాం : కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌
జడ్చర్ల టౌన్‌ : ప్రభుత్వ దవాఖానలను స్టాండర్ట్‌గా మారుస్తామని జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను బుధవారం కలెక్టర్‌ సందర్శించి పరిశీలించారు. దవాఖానలో లేబర్‌ రూం, ఇన్‌పేషంట్స్‌ వార్డు, ఇమ్యునైజేషన్‌, ఆయు ష్‌ విభాగం, ఆపరేషన్‌ థియేటర్‌, చిన్నపిల్లల కేర్‌ యూనిట్‌, ఎమర్జెన్సీ వార్డులను తనిఖీ చేశారు. దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్‌ భాస్కర్‌, ఇతర వైద్యులతో సమీక్ష నిర్వహించారు.

నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్స్‌ ప్రకారం దవాఖానలో అన్ని మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. దవాఖానలో కల్పించాల్సిన వసతులకు సంబంధించిన నిధులను కేటాయిస్తామని కలెక్టర్‌ తెలిపారు. అలాగే, దవాఖానలో అన్ని సదుపాయలు కల్పించేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని డీఈ అశోక్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడుతూ నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్స్‌ ప్రకారం దవాఖానలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం రూ.15లక్షల నిధులు ఉన్నాయని, అవసమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. మరమ్మతు పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో క్వాలిటీ అస్యూరెన్స్‌ అధికారి లక్ష్మి, దవాఖాన వైద్యులు ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...