‘దిశ’ దోషులను కఠినంగా శిక్షించాలి


Thu,December 5, 2019 02:46 AM

దేవరకద్ర రూరల్‌ : దిశ ఘటనలోని దోషులను కఠినంగా శిక్షించాలని స్విట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్‌ కళాశాలలో బుదవారం దిశ ఘటనకు నిరసనగా అధ్యాపకులు, విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అలాగే, రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ ఘటన చాలా దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే నిందితులను ప్రజల మధ్య ఉరి తీయాలన్నారు. మహిళలకు రక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ తేజొవర్ధన్‌, అద్యాపకులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...