త్వరలోక్రిస్మస్‌ కానుకలు


Thu,December 5, 2019 02:46 AM

-జిల్లాకు 3 వేల పండుగ గిఫ్ట్‌లు
-నియోజకవర్గానికి వెయ్యి చొప్పున
-సామూహిక భోజనాల కోసం ఏర్పాట్లు
-రూ.2 లక్షలు కేటాయించిన ప్రభుత్వం
-హర్షం వ్యక్తం చేస్తున్న క్రిస్టియన్లు

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్‌ను పుర్కరించుకొని ప్రతి ఏడాది పండుగ కానుకలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగం గా ఏ ఏడాది కూడా జిల్లాలోని మహబూబ్‌నగర్‌, జడ్చ ర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో 3 వేల క్రిస్మస్‌ కానుకలు పంపిణీ చేసేందుకు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 20లోగా పంపిణీ పూర్తి చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి కానుకలతో పాటు రూ.2 లక్షలు చొప్పున మూడు ని యోజకవర్గాలకు మొత్తం రూ.6 లక్షలతో సమూహిక భోజనాలు ఏర్పాటు చేయనున్నారు. అధికారులతో ఏ ర్పాటు చేసి కమిటీలు, చర్చీల నిర్వాహకులు వీటి కోసం ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకు సంబంధించి నిధు లు క్రిస్టియన్‌ సెలబ్రేషన్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ అందజేయనున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వ ర్గాల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్‌కు, బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ, క్రిస్మస్‌కు గిఫ్ట్‌లను అందిస్తున్నది.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...