ఇండోర్ స్టేడియంలో క్రికెట్ జోనల్ స్థాయి ఎంపికలు


Mon,November 11, 2019 02:08 AM

గద్వాల న్యూటౌన్ : గద్వాలలోని చింతలపేటలో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఆదివారం క్రికెట్ జోనల్ స్థాయి ఎంపికలు జరిగాయి. అండర్-14, అండర్-17 బాలుర విభాగంలో జరిగిన ఈ ఎంపికల్లో ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. అండర్-14 విభాగంలో 175 క్రీడాకారులు, అండర్-17 విభాగంలో 175 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిలో అండర్-14 విభాగంలో 25 మంది క్రీడాకారులు, అండర్-17 విభాగంలో 25 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్టు జిల్లా క్రీడా సమాఖ్య డీవైఎఫ్‌వో శ్రీనివాస్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బీఎస్ ఆనంద్, మహబూబ్‌నగర్ జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, పీఈఈటీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. అయితే క్రికెట్ జోనల్ స్థాయి ఎంపిక కోసం నిర్వహించిన ఈ పోటీలు క్రికెట్ కోచ్ శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహరాజు, మోహన్‌మురళి, శివనాయుడు, మద్దిలేటి, ఆంజనేయులు, రజినీకాంత్‌ల పర్యవేక్షణలో జరిగాయి.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...