చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి


Mon,November 11, 2019 02:08 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని గిరిజన సం క్షేమాధికారి కృష్టనాయక్ అన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నల్గొండ, సూ ర్యపేట, యాదాద్రి జోన్-6 జట్ల ఎంపికలను ఆదివారం జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబర్చితే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు కోదవలేదని, ఎంతో మంది క్రీ డాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, చెస్, ఖోఖో, క్యారమ్స్ అంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికల్లో ప్రతిభ కనబరిచి క్రీడాకారులను జోనల్ జట్టుకు ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. ఎంపికైన జట్లు ఈ నెల 27 నుంచి 29 వ రకు ఆదిలాబాద్ లో జరగనున్న రాష్ట్ర సాయి టోర్నీలో పా ల్గొంటాయ ని తెలిపారు. ఎంపికలకు 732 మంది విద్యార్థులు హాజరుకాగా, బాలికల విభాగంలో 122, బాలుర విభాగంలో 122 మందిని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎటీడబ్ల్యూఓ రామేశ్వరి, రహెమతుల్లా, హెచ్‌డబ్ల్యూ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...