రైతు సంక్షేమమే ధ్యేయం


Mon,November 11, 2019 02:07 AM

కోయిలకొండ : రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అంకిళ్ల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కోయిలకొండ మండలానికి మొదటి విడుదలో సాగునీరు అందుతుందని తెలిపారు. మండలంలోని ప్రతి ఎకరాకూ సాగునీరందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సకాలం లో రాయితీ విత్తనాలు, ఎరువులు అందించడంతోపాటు, మద్దతు ధరకు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. మండలంలోని వరిపంట పం డించిన రైతులు ధాన్యం విక్రయానికి ఇబ్బందులకు గురికాకుండా గార్లపాడ్, అంకిళ్ల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శశికళా భీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ మల్లయ్య, సర్పంచులు రజిత, కృష్ణయ్య, ఎంపీటీసీ రఘునాథ్, కోఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, టీఆర్‌ఎస్ సమన్వయ కర్త ఎస్ రవీందర్‌రెడ్డి, రాజవర్దన్‌రెడ్డి, మోదీపూర్ రవి తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...