పాలమూరును సుందరీకరిస్తాం


Wed,October 23, 2019 02:18 AM

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : పాలమూరు ప ట్టణ దశ దిశ మార్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కేంద్రంలో ప్రధాన చౌరస్తాల విస్తరణ సుందరీకరణ నమూనా మ్యాప్‌లను ప్రత్యేకం గా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎటుచూసినా అభివృద్ధే కనిపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణం అంగరంగవైభవంగా ఆకర్షిణీయంగా ఉండేలా ప్రధాన చౌరస్తాల రూపకల్పన ఉండాలని సూచించారు. రోడ్డు విస్తరణతో పట్టణ రూ పురేఖలు మారనున్నాయన్నారు. అధికారులు బాధ్యతగా చౌరస్తా రూపకల్పన చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న తక్షణమే తనకు సమాచారం అందించాలని, సమిష్టిగా ఉంటూ ప్రతి సమస్యనూ పరిష్కరించి పట్టణాభివృద్ధికి కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ కొరమోని వెంకటయ్య ఉన్నారు.

సంపూర్ణ ఆరోగ్యంతోనే నిండు జీవితం
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నిండుజీవితం తమ సొంతం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ ప్రాంతానికి చెందిన బీ రఘు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరైన రూ.3లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. కార్పొరేట్‌ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న వారిని సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆదుకుంటున్నట్లు చెప్పారు. అభివృధ్ధికి అందరూ సహకారం అందించాలని సూచించారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles