నేటి నుంచి కేజీబీవీల్లో బదిలీలు


Wed,October 23, 2019 02:16 AM

వనపర్తి విద్యావిభాగం: కేజీబీవీల్లో ఏండ్ల తరబడి సిబ్బంది, ఎస్‌వోలు ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. తమ కుటుంబాలు, పిల్లల చదువులకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నామని, బదిలీలు చేపట్టాలనే డిమాండ్‌ ఉన్నది. వారి డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం బదిలీల ప్రక్రియకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి 25వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. పీజీ సీఆర్‌టీలు, ఎస్‌వోలు ఈ నెల 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా డీఈవో కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. 26 నుంచి 28వరకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత జిల్లా విద్యాధికారులు పరిశీలించి ఈ నెల 30న జాబితా విడుదల చేస్తారు. ఈ నెల 30, 31వ తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించి నవంబర్‌ 1న జాబితాను విడుదల చేస్తారు. నవంబర్‌ 2న అభ్యర్థులను పాయింట్ల వారీగా జాబితా విడుదల చేస్తారు. ఇందులో మిచ్యువల్‌ (అవగాహన బదిలీలు) జిల్లాస్థాయి బదిలీలు, అంతర్‌ జిల్లాల బదిలీలు, అన్నింటికి కలిపి బదిలీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. 4,5వ తేదీల్లో పాయింట్ల వారిగా అర్హులైన వారి జాబితాను విడుదల చేయనున్నారు. నవంబర్‌ 6న స్పోర్ట్స్‌ కోటా, 7న బదిలీ అలర్ట్‌మెంట్‌ ఆర్డర్‌, 8న డీఈవో కార్యాలయంలో చేరాల్సి ఉంటుంది.

బదిలీలో పాయింట్ల పట్టిక
బదిలీలో సీఆర్‌టీలకు, పీజీ సీఆర్‌టీలకు, ఎస్‌ఓలకు మెరిట్‌ మార్కుల జాబితా రూపంలో పాయింట్ల ప్రాతిపదికన మెరిట్‌లిస్ట్‌ను తయారు చేస్తున్నారు. సీఆర్‌టీలకు ఆయా సబ్జెక్టులలో 10 పాయింట్లు సాధించిన వారికి ఒక పాయింట్‌, జీపీఏ 9 సాధించిన వారికి 0.5, 8 పాయింట్లు సాధించిన వారికి 0.25 పాయింట్లు కేటాయించారు. అదేవిధంగా ఎస్‌వోలకు తమ పాఠశాలలో జీపీఏ 10 సాధిస్తే ఒక్క మార్కు, జీపీఏ 9 నుంచి 9.8 వరకు సాధిస్తే 0.5, జీపీఏ 8 నుంచి 8.8 సాధిస్తే 0.25 పాయింట్లను కేటాయించారు. పీజీసీఆర్‌టీలో 80శాతం పైగా ఉంటే 3 పాయింట్లు, 80నుంచి 90శాతం ఉత్తీర్ణత ఉంటే 2 పాయింట్లు, 70నుంచి 80శాతం ఉత్తీర్ణత ఉంటే ఒక్క పాయింట్‌, ఇదే పాయింట్లు ఎస్‌వోలకు వర్తిస్తుంది.
బదిలీల్లో మొదటగా మిచ్యువల్‌ ( ఒకరి స్థానంలో మరొకరు), మెడికల్‌, విడో, చట్టబద్ధంగా విడిపోయిన వారు, ఫిజికల్‌ హ్యాండిక్యాప్‌డ్‌, క్యాన్సర్‌, హార్ట్‌ సర్జన్‌, బోన్‌ టీబీ, కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఈ బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. తమ కుటుంబ సభ్యులు మెంటల్‌ రిటైర్డ్‌, బ్లడ్‌ క్యాన్సర్‌, చిన్నప్పటి నుంచి గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉంటే వారికి ప్రాధాన్యత కల్పించనున్నారు.

కమిటీ సభ్యులు
కమిటీ సభ్యులలో కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఈవో కార్యాదర్శిగా, జేసీ మెంటర్‌గా త్రిమాన్‌ కమిటీతో బదిలీలు చేపట్టనున్నారు. మ్యుచువల్‌ బదిలీలు చేసేటప్పుడు సంబంధిత ఎస్‌వో కన్సెంట్‌ లేటర్‌ తప్పనిసరి ఉండాలి. సర్వీస్‌ పరిగణలోకి తీసుకుపోవడంతో సీనియారిటికి అవకాశం లేదు.

పారదర్శకంగా బదిలీలు
మార్గదర్శకాలకు జీవో విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వనపర్తి జిల్లాలో దాదాపు 197 సీఆర్‌టీలు, 7 గురు పీజీసీఆర్‌టీలు, 15 మంది ఎస్‌వోలకు ఈ బదిలీల్లో అవకాశం ఉంది. ఎన్నో ఏండ్లుగా నిరీక్షిస్తున్న వారికి ఇది మంచి సదావకాశం. ఆన్‌లైన్‌ ద్వారా ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది.
- వసంత లక్ష్మి, జీసీడీవో, వనపర్తి

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...