అందరి సంక్షేమానికి కృషి


Fri,October 18, 2019 11:46 PM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : అందరి సంక్షేమం కోసం కంకణ బద్దులమై కృషి చేస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జి ల్లా కేంద్రంలోని న్యూగంజిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీనుగురాల సాయిలు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డిలు గులాబీ కండువా కప్పి పా ర్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పాలమూరు అభివృద్ధికి దూరంగా ఉండేదని, నేడు అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పాలమూరు అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉండి పనిచేస్తున్న ప్ర భుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప ని చేసే కార్యకర్తలు, నాయకులకే గుర్తింపు ఉంటుందన్నారు. ఇప్పటికే భారీ ఎత్తున టీ ఆర్‌ఎస్ సభ్యత్వాలు జరగడంతోపాటు ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని తెలిపారు.

పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేయాలి : ఎంపీ
టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పని చేయాలని ఎంపీ మన్నె శ్రీనివాస్‌గౌడ్ కోరారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు,నాయకులు చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని పథకాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో జీనుగురాల కురుమూర్తి, శ్రీనివాసులు, రాజు, వెంకటేశ్, జగదీశ్వర్, మ్యాడం రాంచంద్రయ్య, ఆంజనేయులు, తిరుపతయ్య, బాలరాజు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, టీఆర్‌ఎస్ నాయకులు రాజేశ్వర్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...