పాలమూరు అభివృద్ధే లక్ష్యం


Fri,October 18, 2019 01:49 AM

-పట్టణ ప్రగతిలో అందరూ పాల్గొనాలి
-ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
-జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : పాలమూరు అభివృద్ధే తమ ముందున్న లక్ష్మమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మున్సిపాలిటీలో చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వా ర్డుల్లో చేపట్టే పనుల కోసం వినియోగించనున్న జేసీబీ, ట్రాక్టర్లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో యుద్దప్రాతిపదికన సమస్యలను పరిష్కరించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. మహబూబ్‌నగర్ పట్ణణ రూపురేఖలు మార్చివేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుదామన్నారు. పల్లెల్లో 30 రోజుల ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేసి, ఇక పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు. ఇప్పటికే పట్టణంలో సీసీ, డ్రై నేజీ నిర్మాణంతోపాటు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని, చౌరస్తాలను అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

రాష్ట్రంలోనే మొదటి సారిగా ఫై లట్ ప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్ పట్టణంలో ఈ కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పి లుపునిచ్చారు. అనంతరం పద్మావతి కాలనీలో రూ.60లక్షలతో చేపట్టనున్న రోడ్డు పునరుద్ధరణ పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే, ఎదిర 4వ రెవె న్యూ వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకున్నా రు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని మంత్రి స్వయంగా జేసీబీ సహాయంతో తొలగించారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ సురేందర్, మాజీ కౌన్సిలర్లు విఠల్‌రె డ్డి, శివశంకర్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, ఎంఈ సత్యనారాయణ పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన
జిల్లా కేంద్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న కళాభారతి, అంబేద్కర్ చౌరస్తా విస్తరణ, బస్టాండ్ సమీపంలోని అన్నపూర్ణ నూతన భోజనశాలను మంత్రి సందర్శించి పనుల పురోగతిని చూశారు. త్వరలోనే అన్నపూర్ణ భోజనశాలను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. కళాభారతి, జంక్షన్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...