ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తునిద్దాం


Thu,October 17, 2019 02:07 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించి బంగారు భవిష్యత్తు అందించాలని డీఆర్డీవో పీడీ క్రాంతి అన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యం లో జిల్లా మహిళా సమాఖ్య భవనంలో బాలికలకు ఏ ర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భం గా బుధవారం బాలికల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆడపిల్లలే కదా అని, సమయం వచ్చినప్పుడు పెండ్లి చేస్తే సరిపోతుందని అ నుకోవద్దని తెలిపారు. బాలికలకు కూడా ఏదో సాధించాలనే తపన ఉంటుందనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని సూచించారు. బాలికలు గ్రామాలకే పరిమితం కావ్వొద్దని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని కుటుంబాలకు ఆసరా గా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించేలా తల్లిదండ్రుల ప్రోత్సహించాలని సూచించారు. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చూపకుండా వారికి బంగారు భవిష్యత్తు అందించేందు కు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో శారద, జేడీఎం దామోదర్ పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...