రాష్ట్రస్థాయి యోగా పోటీలకు దేవరకద్ర విద్యార్థి


Thu,October 17, 2019 02:07 AM

దేవరకద్ర, నమస్తే తెలంగాణ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి భరత్‌కుమార్ రాష్ట్రస్థా యి అండర్-14 యోగా పోటీలకు ఎంపికయ్యాడని పాఠశాల పీడీ రాంచందర్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులకు యోగా పో టీలు నిర్వహించగా, విద్యార్థి భరత్‌కుమార్ ప్రతిభకనబర్చడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఈనెల 18న సిద్ధిపేటలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో విద్యార్థి పాల్గొంటాడని తెలిపారు. కాగా, రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన విద్యార్థి భరత్‌కుమార్‌ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...