అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు


Wed,October 16, 2019 02:31 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : ప్రయాణికుల నుంచి టికెట్ చార్జీ కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని నాగర్‌కర్నూల్ డిపో నోడల్ అధికారి అఖిలేశ్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ బ స్టాండ్, డిపోలను డీఎస్పీ లక్ష్మీనారాయణ, రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారి ఎర్రిస్వామిలతో కలిసి సందర్శించారు. ప్రయాణికులకు ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల బస్సులను పరిశీలించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సరిపడా బస్సులు నడుపుతున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులు జేఏసీ సమ్మెలోకి దిగడంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా రవాణా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రవాణాశాఖాధికారులు ఏర్పాటు చేసిన డ్రైవర్లను డిపో మేనేజర్, ఎంవీఐల ఆధ్వర్యంలో డ్రైవర్ల చోదక నైపుణ్యాలను పరిశీలించి 195 మంది డ్రైవర్లను తాత్కాలికంగా విధుల్లోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. 195 మంది కండక్టర్లను తాత్కాలికంగా తీసుకొని ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నామన్నారు. జిల్లాలో 75 విద్యా సంస్థల బస్సులు, 17 కాంట్రాక్టు క్యారియర్ సి.సి బస్సులు, 120 ప్రైవేట్ క్యాబ్‌లు నడుపుతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు జిల్లాలోని నాలుగు డిపోలకు ఒక్కో డిపోకు నోడల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ డిపోకు అఖిలేష్‌రెడ్డి, కొల్లాపూర్ డిపోకు హనుమానాయక్, అచ్చంపేట డిపోకు పాండునాయక్, కల్వకుర్తి డిపోకు రమేశ్‌కుమార్‌లను నియమించినట్లు తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ టికెట్ ధరలు మాత్రమే చెల్లించాలని, అదనంగా వసూలు చేస్తే సంబంధిత డిపో అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆర్టీవో ఎర్రిస్వామి, డీఎస్పీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...