అబ్దుల్‌కలాం నినాదాన్ని పునికి పుచ్చుకోవాలి


Wed,October 16, 2019 02:28 AM

నాగర్‌కర్నూల్ టౌన్: కలలు కనండి కలలను సాకారం చేసుకోండనే శాస్త్రవేత్త అబ్దుల్ కలాం నినాదాన్ని విద్యార్థులు పునికి పుచ్చుకోవాలని జిల్లా విద్యాధికారి గోవిం దరాజులు పేర్కొన్నారు. మంగళవారం డీఈవో కార్యాలయంలో అబ్దుల్ కలాం జ యంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పేపర్‌బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా దాసాగింది ఆయన ప్రస్థానం అన్నారు. డాలర్ డ్రీమ్స్ కన్నాదేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి త్వం ఆయనది అని కొనియాడారు. ఏడీ అశోక్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, కా ర్యాలయ సిబ్బంది, సెక్టోరల్ అధికారులు అహ్మద్, నారాయణ, యశో దారెడ్డి, ఎఫ్‌ఏవో ఈశ్వరప్ప, ఏసీ రాజశేఖర్‌రావు, నోడల్ అధికారి కురుమయ్య, నాగరాజు, ఎస్‌పీసీ ప్రసాద్‌గౌడ్, రవియాదవ్, నరేందర్, శ్రీనివా సచారి, శైలజ పాల్గొన్నారు.మత్స్యకారుల అభ్యున్నతికి కృషికల్వకుర్తి, నమస్తే తెలంగాణ: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం కల్వకుర్తి పట్టణసమీపంలోని ఈదుల చెరువుల్లో తెలంగాణ మత్స్యకార సహకార సంస్థ ఆధ్వర్యంలో మ త్స్యకారులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కులవృత్తుల వారు ఆర్థికాభివృద్ధి సాధించాల నే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. కులవృత్తులు బలోపేతం అయితే.. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం కులవృత్తులకు పలు రాయితీలు అమలు చేస్తున్న విషయాలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. కులవృత్తులను బలోపేతం చేయడంలో భాగంగా మత్స్యకారుల బలోపేతానికి ప్రభు త్వం అధిక నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం వాహనాలు రాయితీపై అందివ్వడమే కాకుండా చేపపిల్లలు పంపిణీ చేస్తుందని చెప్పారు. చేపల విక్రయాలకు అవసరమైన రీతిలో మార్కెట్‌లు ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ వివరించారు. రైతులకు, మత్సకార్మికుల అండగా ఉండే క్రమంలో అవకాశం ఉన్న ప్రతి చెరువును కృష్ణాజలాలతో నింపుతున్నామని, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేపపిల్లలను సద్వినియోగ పరుచుకోవాలని కారులకు సూచించారు. కా ర్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎడ్మ సత్యం, ఎంపీపీ సునిత, కల్వకుర్తి పురపాలిక మాజీ చైర్మన్ శ్రీశైలం, సింగిల్ విండోఉపాధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్,మనోహర్‌రెడ్డి, శ్రీకాంత్‌తో పాటు మత్సశాఖ ఏడీలు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...